Begin typing your search above and press return to search.

షారుఖ్ కొడుకు, అమితాబాద్ మనవరాలి దాకా.. రాత్రయితే పార్టీలే

By:  Tupaki Desk   |   6 Oct 2021 3:30 AM GMT
షారుఖ్ కొడుకు, అమితాబాద్ మనవరాలి దాకా.. రాత్రయితే పార్టీలే
X
బడాబాబుల కొడుకులు, మనవలు.. బోలెడంత డబ్బు.. ఎంజాయ్ చేయడానికి వాళ్లకు ఎలాగూ టైం లేదు. అందుకే జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు వారి వారసులు. తాజాగా షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. బాలీవుడ్ గురించి తెలిసిన వారికి ఇదేమంత ఆశ్చర్యం కాదు.. ఎందుకంటే బీటౌన్ లో సూర్యుడు ఆస్తమిస్తే చాలు పార్టీలు మొదలవుతాయి. క్లబులు,పబ్బుల్లో, ప్రైవేట్ ఫామ్ హౌస్ లో బాలీవుడ్ జనాలు మద్యం మత్తులో తూగుతుంటారు. వారి లైఫ్ స్టైల్లో అది అలవాటుగా మారింది.తెల్లవారుజామున నాలుగు గంటల దాకా ఈ పార్టీలు నడుస్తుంటాయని ఇన్ సైడ్ టాక్.

ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులను చూసి వారం సంతానం కూడా ఈ పార్టీలకు అలవాటు పడిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ లాంటి ఈతరం స్టార్ కిడ్స్ కూడా పార్టీలకు అలవాటు పడి డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్నారు.డ్రగ్స్ సంగతి పక్కనపెడితే పార్టీల్లో యంగ్ స్టార్స్ అంతా ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేస్తుంటారు. వారి ఫొటోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి.

షారుఖ్ కొడుకు నుంచి అమితాబ్ మనవరాలి దాకా అందరూ ఇదే కోవలో ఎంజాయ్ చేస్తారని బాలీవుడ్ లో ప్రచారం ఉంది. సముద్రంలో షిప్ మీద పార్టీ చేసుకుంటూ ఎన్సీబీకి చిక్కిన ఆర్యన్ ఖాన్ లాగే అతడి సోదరి కూడా పార్టీల్లో తెగ కనిపిస్తుందట.. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ రెగ్యులర్ గా పార్టీల్లో తళుక్కుమంటూ మెరుస్తుంది. సుహానా బెస్ట్ ఫ్రెండ్స్ అనన్య పాండే కూడా కనిపిస్తుంటుందట.. ఇక మరో స్టార్ కిడ్ షనాయా కపూర్ కూడా కనిపిస్తుంటుంది. సోనమ్, జాన్వీ లాంటి బాలీవుడ్ హీరోయిన్ల చెల్లెలు షనాయా ఎంజాయ్ మెంట్ గురించి కథలు గా చెబుతున్నారు.ఇక హీరోయిన్ జాన్వీకపూర్ సైతం తెగ ఎంజాయ్ చేస్తుంటుంది.

ఇలా బాలీవుడ్ సినీ ప్రముఖుల పిల్లలు ఇలా పార్టీల్లో మునిగితేలుతూ తెగ సందడి చేస్తుంటారు. తాజాగా ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తోనైనా వీరి పార్టీలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.