Begin typing your search above and press return to search.

దిల్ రాజు పెళ్లికి హాజరైన టాలీవుడ్ ముఖ్యులెవరంటే?

By:  Tupaki Desk   |   11 May 2020 4:20 PM IST
దిల్ రాజు పెళ్లికి హాజరైన టాలీవుడ్ ముఖ్యులెవరంటే?
X
టాలీవుడ్ లో బడా నిర్మాత దిల్ రాజు ఎట్టకేలకు ఊహాగానాలకు తెరదించుతూ రెండో వివాహం చేసుకున్నారు. ఆయన మొదటి భార్య అనిత 2017లో అనారోగ్యంతో మరణించారు. ఈ ఘటన దిల్ రాజు ను మానసికంగా బాగా కలిచి వేసింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న దిల్ రాజుకు ఆయన కూతురే స్వయంగా దగ్గరి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేసినట్టు ప్రచారం సాగుతోంది.

దిల్ రాజ్ తన రెండో వివాహాన్ని ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో చేసుకున్నారు. తనే స్వయంగా కట్టించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో పరిమిత కుటుంబ సభ్యులు - బంధువులు సన్నిహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.

వధువు పేరు తేజస్విని అని.. ఆమె పేరును ఆస్ట్రాలజీ ప్రకారం.. వ్యాఘరెడ్డిగా మార్చినట్టు చెబుతున్నారు. ఆమె బ్రాహ్మణ అమ్మాయి అని.. ఎయిర్ హోస్టెస్ గా గతంలో చేసిందని.. దిల్ రాజు కులాంతర వివాహం చేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది.

అయితే టాలీవుడ్ లో బడా నిర్మాత దిల్ రాజు ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త దర్శకులకు లైఫ్ ఇచ్చారు. అలాంటి ఆయన పెళ్లికి టాలీవుడ్ పెద్దలు ఎవరూ హాజరు కాలేదని అందరూ అనుకున్నారు. కానీ ఇద్దరు యువ దర్శకులు ఆయన పెళ్లికి హాజరైనట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సెన్షేషనల్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి - హరీష్ శంకర్ లు హాజరయ్యారని అంటున్నారు. అయితే వారు హాజరు అయినట్టు ఫొటోల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు.వీరిద్దరూ దిల్ రాజ్ కు అత్యంత ఆప్తులైన దర్శకులుగా పేరుంది.