Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ముందుగా ఏ రీమేక్ ని స్టార్ట్ చేస్తాడో...?
By: Tupaki Desk | 4 Sept 2020 2:20 PM ISTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్నారని తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా రీమేక్ బాధ్యతలు 'సాహో' ఫేమ్ సుజిత్ కి అప్పజెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుకోని కారణాల వల్ల ఈ రీమేక్ ప్రాజెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దగ్గరకు చేరింది. చిరంజీవితో ఇంతకముందు 'ఠాగూర్' 'ఖైదీ నెం.150' వంటి రీమేక్ సినిమాలను వీవీ వినాయక్ సమర్థవంతంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీంతో 'లూసిఫర్' రీమేక్ పై మెగా అభిమానులకు నమ్మకం కలిగింది. చిరంజీవి సలహాలు సూచనలకు అనుగుణంగా వినాయక్ తన టీమ్ తో కలిసి మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు చేసారట. అంతేకాకుండా బెంగుళూరులో ఉన్న చిరంజీవిని కలిసి తన వర్షన్ స్క్రిప్ట్ ని కూడా వినిపించాడని తెలుస్తోంది. చిరుకి ఈ స్క్రిప్ట్ నచ్చిందని.. 'ఆచార్య' కంప్లీట్ అయిన వెంటనే 'లూసిఫర్' రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో వర్గాల్లో అనుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా మెగాస్టార్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. లేటెస్టుగా పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని కంఫర్మ్ చేశాడు. అయితే ఇది కూడా రీమేక్ అని సమాచారం. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ''వేదలమ్'' సినిమాని చిరంజీవితో రీమేక్ చేయడానికి మెహర్ రమేష్ సన్నాహకాలు చేసుకున్నాడని తెలుస్తోంది. లాక్ డౌన్ లో మెహర్ రమేష్ ఈ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని పెట్టుకున్నాడట. అయితే ఇప్పుడు ఈ రెండు రీమేక్ లలో ఏది ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి. మాతృక సినిమాలు చూసుకుంటూ రెండు మంచి కథాబలం ఉన్న చిత్రాలే. ఇక డైరెక్టర్స్ విషయానికొస్తే ఇద్దరూ ప్లాపుల్లో ఉన్నవారే. వి.వి. వినాయక్ సాయి ధరమ్ తేజ్ తో తీసిన 'ఇంటెలిజెంట్' మూవీ పరాజయం చెందిన తర్వాత మరో సినిమా చేయలేదు. ఇక మెహర్ రమేష్ పలు యాడ్స్ కి డైరెక్షన్ చేసినప్పటికీ 'షాడో' తర్వాత మరో సినిమాకి దర్శకత్వం వహించలేదు. మరి ఇప్పుడు మెగాస్టార్ ఈ ఇద్దరిలో ముందుగా ఎవరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడో చూడాలి.