Begin typing your search above and press return to search.

అలీ నిర్మాత‌గా ప‌వన్ క‌ళ్యాణ్ సినిమా?

By:  Tupaki Desk   |   21 Feb 2021 8:00 PM IST
అలీ నిర్మాత‌గా ప‌వన్ క‌ళ్యాణ్ సినిమా?
X
అలీ నిర్మాత‌గా ప‌వన్ క‌ళ్యాణ్ సినిమా చేస్తున్నారా? అంటే అవును ఇది నిజ‌మేన‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఏ హాలులో విన్నా అంద‌రి నోట ఇదే మాట‌..! త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న‌ రాబోతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

వివ‌రాల్లోకి వెళితే ప‌వ‌న్ కల్యాణ్ - అలీ మ‌ధ్య స్నేహం గురించి చెప్పాల‌సిన అవ‌స‌రం లేదు. అయితే ఎంత‌ సాన్నిహిత్యం ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌లే వీరిద్ద‌రికీ రాజ‌కీయ ప‌ర‌మైన విభేదాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే..! అయితే మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాల్లోకి రావ‌డం.. తాజాగా అలీ కూడా అలీవుడ్ అనే ప్రొడ‌క్ష‌న్ కంపెనీ పెట్టి ఓ సినిమాని ప్రారంభించ‌డం వంటి ఘ‌ట‌న‌ల‌ నేప‌థ్యంలో ప‌వ‌న్ తో అలీ సినిమా చేస్తున్నార‌నే టాక్ ఊపందుకుంది,. ఈ సినిమాకు డాలీ ద‌ర్శ‌కుడుగా ఉంటాడ‌ని సమాచారం.

ఒక వేళ‌ ఈ సినిమా కూడా ఓకే చేస్తే ప‌వ‌న్ ఏకంగా 8 సినిమాలు ఒప్పుకున్న‌ట్లు అవుతుంది..! 2024 లోపు ఈ ఎనిమిది సినిమాలు పూర్తి చేసి మ‌ళ్లీ పొలిటిక‌ల్ ఫైట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగాల్సి ఉంటుంది. అయితే ప‌వ‌న్ కి ఇప్ప‌టికి ఉన్న క‌మిట్ మెంట్లు హాట్ టాపిక్ గానే మారాయి.