Begin typing your search above and press return to search.

బాలయ్య ఇద్దరిలో ఎవరి వైపు ముగ్గు చూపుతారో..!

By:  Tupaki Desk   |   25 July 2021 8:00 AM IST
బాలయ్య ఇద్దరిలో ఎవరి వైపు ముగ్గు చూపుతారో..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ జోరుమీదున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన బాలయ్య.. ఎన్నడూ లేనంత స్పీడ్ గా సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా 'అఖండ' అనే యాక్షన్ ఎంటర్టైనర్ ని చివరి దశకు తీసుకొచ్చారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేని తో '#NBK107' మూవీ ప్రకటించారు బాలయ్య. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవి శంకర్ నిర్మించనున్నారు.

ఇటీవల బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ రెండు సినిమాల తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఏడాదికి మూడు సినిమాలు చేయాలని ఫిక్స్ అయిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా.. పూరి జగన్నాథ్‌ తో ఒక మూవీ ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. అలానే హరికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్ లో ఒక చిత్రం చేయనున్నట్లు తెలిపారు. అలానే తనయుడు మోక్షజ్ఞ ని ఇంట్రడ్యూస్ చేస్తూ 'ఆదిత్య‌ 369' కు సీక్వెల్ గా 'ఆదిత్య 999 మాక్స్' సినిమా చేయనున్నట్లు ఇదివరకే వెల్లడించారు.

#NBK107 తర్వాత ముందు అనిల్ రావిపూడితో చేయాలని అనుకునన్నారు బాలకృష్ణ. ఇప్పటికే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ స్టోరీ కూడా వినిపించారు. 'ఎఫ్ 3' సినిమా కంప్లీట్ అయ్యాక పూర్తి సమయం బాలయ్య స్క్రిప్ట్ మీదే వర్క్ చేయాలని అనిల్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు నటసింహం తన ఆలోచన మార్చుకొని అనిల్ కంటే ముందు.. పూరీతో సినిమా చేయాలని భావిస్తున్నారట. తనకు 'పైసా వసూల్' వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన పూరీతో మరో సినిమా చేయాలని బాలయ్య ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. పూరీ కూడా సీనియర్ హీరో కోసం పలు స్టోరీ లైన్లు రెడీ చేసి పెట్టుకున్నారు.

కాకపోతే బాలయ్య లైనప్ చూసి బాలయ్య - పూరీ కాంబినేషన్ లో సినిమా రావడానికి కాస్త ఎక్కువ టైం పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. పూరీ - అనిల్ ఇద్దరూ కూడా తక్కువ సమయంలో క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వగలిగిన దర్శకులు. ఎలాంటి స్టార్ హీరో అయినా వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేయగలరు. అనిల్ రావిపూడి - పూరీ లలో బాలయ్య ముందుగా ఎవరి సినిమా మొదలు పెట్టినా.. తదుపరి ప్రాజెక్ట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. మరి బాలయ్య ఇద్దరిలో ఎవరి వైపు ముగ్గు చూపుతారో చూడాలి.