Begin typing your search above and press return to search.

రాయ్ ల‌క్ష్మీ టీచ‌ర్‌ నే న‌మ్మాం!!

By:  Tupaki Desk   |   12 March 2019 11:45 AM GMT
రాయ్ ల‌క్ష్మీ టీచ‌ర్‌ నే న‌మ్మాం!!
X
దిల్ రాజు స్ఫూర్తితో నిర్మాత‌న‌య్యాన‌ని చెబుతున్నారు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కం బిజినెస్ మేన్ శ్రీ‌ధ‌ర్ రెడ్డి. ఆయ‌న వ‌స్తూనే ఇండ‌స్ట్రీ క‌మ‌ర్షియ‌ల్ వాస‌న ప‌ట్టేశారు. రాయ్ ల‌క్ష్మీ లాంటి క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ తో వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి అంటూ ప్ర‌యోగ‌మే చేశారు. ఓ కామెడీ సినిమా తీయాల‌నుకుని.. రాయ్ ల‌క్ష్మీని ఎంపిక చేసి మ‌సాలాని ఏర్చి కూర్చి తీసిన సినిమానే ఇది అని చెబుతున్నారాయ‌న‌. అస‌లు ఆవిడ‌నే ఎందుకు ఎంచుకున్నారు? అని ప్ర‌శ్నిస్తే ఆవిడే థియేట‌ర్ల‌కు జ‌నాల‌ను ర‌ప్పిస్తుంద‌ని మా న‌మ్మ‌కం అని తెగేసి చెప్పారాయ‌న‌. రాయ్ ల‌క్ష్మీ టీచ‌ర్ చుట్టూ తిరిగే ఈ క‌థ‌లో క‌మెడియ‌న్ల పాత్ర ఏంటి? పిల్ల‌ల టీచ‌ర్ గా ఆవిడేం చేసింది? అన్న‌ది తెర‌పైనే చూడ‌మ‌ని భ‌రోసానిచ్చారు.

రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన‌ కామెడీ ఎంటర్టైనర్ `వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి` ఈనెల‌ 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి హైద‌రాబాద్ మీడియాతో ముచ్చ‌ట్లాడుతూ ర‌క‌ర‌కాల సంగ‌తుల్ని చెప్పారు. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ మొత్తం హర్రర్ నేప‌థ్య ంలో చిత్రం కాదు. హర్రర్ ఎలిమెంట్స్ కొంత భాగం మాత్ర‌మే. ఈ సినిమా పూర్తి కామెడీతో అల‌రించే వినోదాత్మ‌క చిత్రం. రచయిత తటవర్తి కిరణ్ ఈ కథ చెప్పగానే న‌చ్చి, వెంట‌నే దర్శకుడు కిషోర్ కుమార్ తో ఈ సినిమా తెర‌కెక్కించాం అని తెలిపారు.

తొలుత వేరే క‌థానాయిక‌ల్ని అనుకున్నా రాయ్ ల‌క్ష్మీనే ఆ పాత్ర‌కు స‌రిపోతుంద‌ని పించింద‌ని అన్నారు. వెంకటలక్ష్మిగా రాయ్ లక్ష్మీ అయితేనే న్యాయం జరుగుతుందనిపించింది. నాదే ఆ ఎంపిక‌. ఇప్పటివరకూ రాయ్ లక్ష్మీకు తెలుగులో ఆమెకు తగ్గ పాత్రలను ఎవ్వరూ ఇవ్వలేదు. అంత గొప్ప పేరు తెచ్చే చిత్ర‌మిది. గ్రామీణ నేపథ్యంలో ప్రధానంగా కామెడీ, హాస్య ం..టు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. వినోదంతో పాటు సస్పెన్స్ మ‌రిపిస్తాయి... అని తెలిపారు. పెద్ద సినిమా చేయాలి. రెండు మూడు కథలున్నాయ‌ని వెల్ల‌డించారు.