Begin typing your search above and press return to search.

సీటిమార్ నుండి 'పెప్సీ ఆంటీ' ఐటమ్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే??

By:  Tupaki Desk   |   20 March 2021 2:30 AM GMT
సీటిమార్ నుండి పెప్సీ ఆంటీ ఐటమ్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే??
X
టాలీవుడ్ హీరో గోపీచంద్ తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ సినిమాను విడుదలకు సిద్ధం చేసాడు. ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదివరకు సంపత్ - గోపిచంద్ కాంబోలో 'గౌతమ్ నంద' సినిమా వచ్చింది. టాక్ బాగానే వచ్చినప్పటికీ కమర్షియల్ గా సినిమా సక్సెస్ కాలేదు. అప్పటినుండి సంపత్ నుండి ఏ సినిమా రాలేదు. భారీ గ్యాప్ తీసుకొని మంచి స్పోర్ట్స్ స్క్రిప్ట్ తో గోపీతో సీటిమార్ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో గోపీచంద్, తమన్నాలు కబడ్డీ కోచ్ లుగా కనిపించనున్నారు. కానీ సంపత్ సినిమాలలో క్లాస్ అంశాలతో పాటు మాస్ మసాలా అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే.

సీటిమార్ గర్ల్స్ కబడ్డీ నేపథ్యమైనా సంపత్ మార్క్ పాటలు, మాస్ అంశాలు ఉంటాయని తెలుస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నుండి ఇటీవలే టైటిల్ సాంగ్, జ్వాలారెడ్డి డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది. సంపత్ మంచి మ్యూజిక్ రాబట్టగల దర్శకుడు.. ప్రతీ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తుంటాడు. సీటిమార్ లో కూడా మంచి మసాలా పాట ఉందట. ఈ ఐటమ్ పాటలో బూమ్ బద్దల్ బ్యూటీ 'అప్సరరాణి' నర్తించనుంది. క్రాక్ సాంగ్ తో హాట్ అందాలను ఆరబోసి కుర్రాళ్లలో హీట్ పెంచింది అప్సర. తాజాగా అప్సర ఆడిపాడిన 'పెప్సీ ఆంటీ' అనే సాంగ్.. మార్చ్ 21న ఉదయం 11:17 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పాటకోసం అప్సర ఫ్యాన్స్ బాగానే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.