Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 3కి మోక్షం ఎప్పుడు ?

By:  Tupaki Desk   |   31 May 2019 10:06 AM IST
బిగ్ బాస్ 3కి మోక్షం ఎప్పుడు ?
X
హిందీలో తమిళ్ లో అప్రతిహతంగా దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకి తెలుగులో మాత్రం ప్రతి సీజన్ కి పురిటి నొప్పులు తప్పడం లేదు. యాంకర్ ఒకరే ఉండకపోవడం కంటెస్టెంట్స్ ని సెట్ చేయడంలో వస్తున్న సమస్యలు వివాదాలను హ్యాండిల్ చేయటంలో జరుగుతున్న పొరపాట్లు మొత్తానికి ఇప్పుడు మూడో సీజన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.

తమిళ్ లో జూన్ 23 నుంచి బిగ్ బాస్ 3 మొదలు కానుంది. ఈ మేరకు ప్రోమోస్ కూడా వచ్చేశాయి. శ్రీరెడ్డి ఒక పార్టిసిపెంట్ గా ఉండొచ్చనే టాక్ ఇప్పటికే ఉంది. మొదటి రెండు సిరీస్ లను దిగ్విజయంగా నడిపించిన లోక నాయకుడు కమల్ హాసనే దీనికీ బాధ్యతలు తీసుకున్నాడు. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెన్నై రిపోర్ట్

కానీ తెలుగులో మాత్రం ఇంకా యాంకర్ ఎవరు అనేది తేలలేదు. నాగార్జున పేరు చాలా బలంగా వినిపిస్తోంది కానీ అదీ అఫీషియల్ గా చెప్పడం లేదు. వెంకటేష్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ఇలా రకరకాల పేర్లు ప్రచారమయ్యాక ఫైనల్ గా నాగ్ వద్ద వచ్చి ఆగింది. ఆయనేమో మన్మధుడు 2 షూటింగ్ తో పాటు బంగార్రాజు ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు.

నిజంగా చేస్తారా లేదా అనే క్లారిటీ కూడా లేదు. అసలు ఇది పక్కా అయితే మిగిలిన పనులు వేగవంతం చేయవచ్చు. వంద రోజుల పాటు షోకు అగ్రిమెంట్ చేసే పదహారు మంది పార్టిసిపెంట్స్ దొరకడం అంత ఈజీ కాదు. సో ఇవన్ని ఒక కొలిక్కి తెచ్చి కనీసం జూలైలోనైనా మొదలుపెడతారేమో వేచి చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా బయటికి వచ్చింది కాని గాయం వల్ల జరిగిన ఆలస్యంతో తను పూర్తిగా ఆర్ఆర్ఆర్ కు అంకితమైపోయినట్టే