Begin typing your search above and press return to search.
ఆంక్షల మధ్య నితిన్ - నిఖిల్ పెళ్లి చేసుకుంటారా?
By: Tupaki Desk | 2 May 2020 4:40 PM ISTఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే మరీ.. లేక లేక చేసుకుంటున్న తొలి పెళ్లి. పైగా వారిద్దరూ టాలీవుడ్ లోనే యంగ్ హీరోలు. దీంతో అంగరంగ వైభవంగా.. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలేసి ఐదురోజుల పెళ్లిళ్లు చేసుకుందామని.. అంబానీలలా పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుందామని ఆశించారు. కానీ వారిపై కరోనా పిడుగు పడింది. దీంతో ఇప్పటికే వాయిదా వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్ - నిఖిల్ ల పెళ్లిళ్లు భవిష్యత్ లోనూ ఘనంగా చేసుకోవడం కష్టమనే తేలింది.
లాక్ డౌన్ ముగింపుదశకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొన్ని సడలింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలను.. కేసుల సంఖ్యను బట్టి గ్రీన్ - ఆరెంజ్ - రెడ్ జోన్లుగా విడగొట్టింది. గ్రీన్ జోన్లలో వ్యాపారాలకు - మరిన్ని వాటిని అనుమతులు ఇచ్చింది.
ఇక లాక్ డౌన్ లో టాలీవుడ్ హీరోలు నితిన్ - నిఖిల్ సహా ఎంతో మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వం పెళ్లిళ్లకు అనుమతులు ఇవ్వకపోవడం తూతూ మంత్రంగా చేసుకోవడానికి ఇష్టపడక వీరంతా ఆఫ్టర్ లాక్ డౌన్ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక గ్రాండ్ గా పెళ్లి చేసుకుందామని ఆగారు.
కానీ కరోనా ఇప్పట్లో మనుషులను వదిలేలా కనిపించడం లేదు. కేంద్రం తాజాగా పెళ్లి చేసుకునే వారికి ఉపశమనం కలిగించింది. కానీ నిబంధనలతో ఆ ఊపు ఉత్సాహం ఆవిరైంది. గ్రీన్ జోన్లు - కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 50 మంది వరకు పెళ్లికి హాజరైతే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. అయితే పెళ్లికి హాజరు అయ్యేవారంతా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. ఇక పెళ్లికి వచ్చిన వారంతా భౌతిక దూరం పాటించాలని సూచించింది.
ఈ పరిణామం మన యంగ్ హీరోలు నితిన్ - నిఖిల్ లకు ఆశానిపాతం అయ్యింది. ఎందుకంటే ఈ హీరోలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ - ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఇక వీరి కుటుంబ సభ్యుల సంఖ్యే 50 దాటుతుంది. ఇక మిగతా హీరోలు.. నటులు - ఫ్యాన్స్ రావడానికి వీల్లేని పరిస్థితి. ఇక మొత్తం చుట్టాలను కూడా పెళ్లికి తీసుకురాలేని దుస్థితి. మరి ఇంతటి ఆంక్షల మధ్య మన హీరోలు నితిన్, నిఖిల్ లు పెళ్లి చేసుకుంటారా మరోసారి వాయిదా వేస్తారా అన్నది వేచిచూడాలి.