Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ `ఐకాన్` ముహూర్తం ఎపుడు?

By:  Tupaki Desk   |   17 Oct 2021 7:30 AM GMT
అల్లు అర్జున్ `ఐకాన్` ముహూర్తం ఎపుడు?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పుష్ప డ్యూయాల‌జీలో `పుష్ప: ది రైజ్` షూటింగ్ ని పూర్తి చేయనున్నారు. కొద్ది రోజుల్లో చిత్రీక‌ర‌ణ సాంతం పూర్త‌వుతుంద‌ని .. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంద‌ని తెలిసింది. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఏకకాలంలో జరుగుతోంది. నవంబర్ మొదటి వారంలో మొత్తం చిత్రీకరణ పూర్తవుతుంది.

ఇప్పుడు `పుష్ప: రైజ్` పూర్తయ్యే దశలో ఉంది. ఆ క్ర‌మంలోనే అల్లు అర్జున్ ఐకాన్ మీద దృష్టి పెడుతున్నార‌ని తెలిసింది. ఈ డిసెంబర్ నుండి ఐకాన్ షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నార‌ట‌. అధికారికంగా ఈ సినిమాని త్వరలో ప్రకటిస్తారు. రెగ్యులర్ షూటింగ్ తదనుగుణంగా ప్రారంభమవుతుంది. ఐకాన్ కి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే ఒక క‌థానాయిక‌. ప‌లువురు బాలీవుడ్ భామ‌ల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఐకాన్ చిత్రానికి దిల్ రాజు భారీ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూర్చ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఫ్యామిలీ వెకేష‌న్ ముగించారు..

బ‌న్ని ఫ్యామిలీ ఇటీవ‌ల మాల్దీవుల్లో విహ‌రించిన సంగ‌తి తెలిసిందే. తన భార్య స్నేహ.. పిల్లలు అర్హా - అయాన్ తో కలిసి ఒంట‌రి దీవుల్లో రిలాక్స్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి. నిజానికి అల్లు అర్జున్ 6 నెలల్లో మాల్దీవులను సందర్శించడం ఇది రెండోసారి. బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ కి ధీటుగా బ‌న్ని మాల్దీవుల విహారానికి పోటీప‌డుతున్నార‌నే చెప్పాలి. గ‌త ఏప్రిల్ లో అల్లు ఫ్యామిలీ మాల్దీవుల్లో వెకేష‌న్ కి వెళ్లింది. అయాన్ పుట్టినరోజును మాల్దీవులలోని ఓ రిసార్ట్ లో జరుపుకున్నారు. మరోసారి మాల్దీవుల్లో నీలి మహాసముద్రం మధ్య ఇదే రిసార్ట్ లో ఆతిథ్యం పొందారు.

పుష్ప ట్రీట్ పాన్ ఇండియా లెవ‌ల్లో

అల్లు అర్జున్ `పుష్ప-1` చిత్రీక‌ర‌ణ‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల‌ బన్నీ -ఫహద్ మధ్య ముఖాముఖి హోరాహోరీ సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో- విల‌న్ మ‌ధ్య సన్నివేశాలు సినిమాకు అతి పెద్ద హైలైట్ కానున్నాయి. పుష్ప చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ డిసెంబర్ లో విడుదలవుతుంది. `పుష్ప-డ్యూయాలజీ` పై తొలి నుంచి భారీ అంచనాలున్నాయి. బన్నీని నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించే ఫ్రాంఛైజీగా నిలిచిపోతుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. స్టైలిష్ టిఫికల్ ఫిలిం మేకర్ సుకుమార్ పుష్ప చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో బహుభాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు- తమిళం- మలయాళం- కన్నడం- హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. రెండు భాగాల ఫ్రాంచైజీలో మొదటి భాషం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ నేపథ్యంలో పార్ట్ -1 ఈ ఏడాది క్రిస్మ‌స్ కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గిరిజన యువతి పాత్రలో రష్మిక కనిపించనుందని యూనిట్ రివీల్ చేసింది. ఇప్పటికే ఈ రెండు పాత్రల ఫస్ట్ లుక్ లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో వివాహిత గా గృహిణి శ్రీ‌వల్లిగా రష్మిక కనిపించనుందని చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. అంటే పుష్పరాజ్- రష్మిక భార్యాభర్తలుగా కనిపిస్తారని టాక్ ఉంది. దానికి త‌గ్గ‌ట్టే ర‌ష్మిక లుక్ వేడెక్కించింది. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ ఛేజ్ ల‌తో ఈ సినిమా బ‌న్ని అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా నిల‌వ‌నుంది.