Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ బావమరిది సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
By: Tupaki Desk | 24 March 2021 5:17 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర హీరోగా పరిచయం కానున్నాడని ఈ మధ్య వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తారక్ సతీమణి లక్ష్మీప్రణతి తమ్ముడు నితిన్. ఇప్పటికే నటనలో మార్షల్ ఆర్ట్స్ లోను శిక్షణ తీసుకున్న నితిన్.. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. టాలీవుడ్ కు ఎంతో మంది నటీనటులను సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ, నితిన్ చంద్రను హీరోగా లాంచ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
తేజ ఇటీవలే 21 ఏళ్ల క్రితం తను డైరెక్ట్ చేసిన 'చిత్రం' సినిమాకి సీక్వెల్ గా ''చిత్రం 1.1'' చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 'చిత్రం మూవీస్' మరియు 'ఎస్ స్టూడియోస్' సంయుక్తంగా నిర్మించే ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో 45 మంది కొత్తవాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నానని తేజ వెల్లడించారు. అయితే ఇందులో హీరోగా ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లేనని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఏప్రిల్ 18న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమవుతుందని అనుకుంటున్నారు. ఇకపోతే బావమరిది ఎంట్రీ వెనుక ఎన్టీఆర్ ప్రోద్బలం ఎంత మేరకు ఉందనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు.