Begin typing your search above and press return to search.

బాలీవుడ్ విమర్శకుల పక్షపాత వైఖరి బయటపడిందిగా..?

By:  Tupaki Desk   |   21 May 2022 9:47 AM GMT
బాలీవుడ్ విమర్శకుల పక్షపాత వైఖరి బయటపడిందిగా..?
X
బాలీవుడ్ గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు సౌత్ సినిమాలు నార్త్ లో వీరవిహారం చేస్తుంటే.. మరోవైపు హిందీ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం 'ధాకడ్' మరియు 'భూల్ భులైయా 2' వంటి రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమాల ''ధాకడ్‌''. రజనీశ్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ఆమె ఏజెంట్‌ అగ్ని అనే గూడఛారి పాత్ర పోషించింది. అర్జున్ రాంపాల్ తో పాటూ దివ్యా దత్తా - షరీబ్ హష్మి - శాశ్వత ఛటర్జీ కీలక పాత్రల్లో నటించారు.

బాలీవుడ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్ - కియరా అద్వాణీ - టబు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ చిత్రం ''భూల్ భులయ్యా 2''. ఇది 'భూల్ భూలైయా' ఫ్రాంచైజీలో తెరకెక్కిన సినిమా. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మించింది.

'ధాకడ్' మరియు 'భూల్ భులైయా 2' చిత్రాలు రెండూ ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించాయి. దీనికి తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. హీరోకి ఉన్న క్రేజ్ కారణంగా ఒక సినిమా ఏ-సెంటర్‌లలో మంచి ఆదరణ దక్కించుకుంటే.. ఫైర్ బ్రాండ్ గ్లామర్ అండ్ యాక్షన్ తో మరో సినిమా మాస్ సెంటర్లలో గర్జించింది.

చాలా రోజుల తర్వాత రెండు హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన విషయంలో బాలీవుడ్ విమర్శకులు రెండు గ్రూపులుగా విడిపోయారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కొంతమంది క్రిటిక్స్ 'భూల్ భులైయా 2' చిత్రానికి నాలుగు స్టార్ల రేటింగ్ ఇచ్చి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. నటీనటుల పెర్ఫార్మన్స్ తో పాటుగా సినిమాలోని ప్రతి అంశాన్ని ప్రశంసిస్తూ మూవీని ఆకాశానికి ఎత్తారు. అదే సమయంలో ఈ విమర్శలు 'ఢాఖడ్‌' సినిమాకి కేవలం 1-స్టార్‌ ను మాత్రమే రేటింగ్ ఇచ్చి ప్లాప్ గా తేల్చేశారు.

మరికొందరు విమర్శలు కంగనా చిత్రానికి నాలుగు స్టార్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ ని పేర్కొన్నారు. యాక్షన్ - క్రేజీ విజువల్స్ మరియు అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కూడిన విజువల్ ఫీస్ట్ అని పేర్కొన్నారు. అయితే వీరు 'భూల్ భులైయా 2' సినిమాని అవుట్ డేటెడ్ హర్రర్ కామెడీగా పేర్కొంటూ.. ఒకటీ రెండు స్టార్లు మాత్రమే ఇచ్చారు.

ఇదంతా గమనించిన సినీ అభిమానులకు బాలీవుడ్ మీడియా మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయిందనే దానిపై ఓ క్లారిటీకి వచ్చేసారు. తమ ఫేవరేట్ సినిమాకు మద్దతు ఇస్తూ.. ఇతర చిత్రాలను వారి రివ్యూలతో చంపేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రిటిక్స్ అందరూ వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్స్ మరియు మీడియా సంస్థల్లో అత్యంత ప్రశంసలు పొందిన జర్నలిస్టులుగా ఉండటం గమనార్హం. వీరి రివ్యూలు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. ఇప్పుడు వీరు 'ధాకడ్' - 'భూల్ భులైయా 2' సినిమాలకు ఇచ్చిన రివ్యూలు చూస్తుంటే.. ఇంతకుముందు చిత్రాలకు ఇచ్చిన రేటింగ్స్ అన్నీ జెన్యూనేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.