Begin typing your search above and press return to search.
సౌందర్య, బాలయ్య సినిమా రిజెక్ట్ చేసిన వేళ!
By: Tupaki Desk | 11 Aug 2022 5:35 AM GMTనందమూరి బాలకృష్ణ కెరీర్ లో అత్యంత ఎక్కువగా హైప్ క్రియేట్ చేసిన సినిమాలలో చెన్నకేశవరెడ్డి ఒకటి. ఆది సినిమా తర్వాత మాస్ కమర్షియల్ దర్శకుడు వివి వినాయక్ నందమూరి బాలకృష్ణ తో చేస్తున్న సినిమా అనగానే ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని దాటిపోయాయి.
అప్పట్లో ఈ సినిమా పోస్టర్లకు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా ముందుగానే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేయడంతో సినిమాకు నెవర్ బిఫోర్ అనేలా ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.
అయితే కథలో కొన్ని తప్పుల వలన సినిమా పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేక పోయింది. కానీ సినిమాలో కొన్ని ఎలివేషన్స్ మాత్రం ఇప్పటికీ అభిమానులు ఉన్నారు అని చెప్పవచ్చు.
ఒక విధంగా సినిమా పూర్తిస్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా నిర్మాతలను అయితే నష్టాలను కలిగించలేదు. అయితే ఈ క్రమంలో దర్శకుడు వివి నాయక్ ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు.
ముఖ్యంగా ఈ సినిమాలో సౌందర్య కూడా నటించాల్సిందట అంతేకాకుండా మరొక క్యారెక్టర్ కోసం లయను అనుకోగా ఆమె కూడా రిజెక్ట్ చేయడంతో మరొకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందట. వినాయక్ మాట్లాడుతూ.. చెన్నకేశవరెడ్డి సినిమాల్లో టబు చేసిన పాత్ర కోసం మొదట సౌందర్యం అనుకున్నాము సౌందర్యతో నాకు పరిచయం ఉండడం వలన ప్రత్యేకంగా కలిసి కథ గురించి చెప్పడం జరిగింది.
ఆమెకు కథ నచ్చింది కానీ ఆమె అప్పుడే తల్లిపాత్రలో నటించడానికి ఆసక్తిగా లేనని చెప్పడంతో మరో దారి లేక టబు గారిని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆమె కథ వినగానే ఒప్పుకున్నారు. అలాగే బాలకృష్ణ సోదరి పాత్ర కోసం లయను అనుకున్నాను. కానీ ఆమె హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో అప్పుడే సిస్టర్ పాత్ర ఏమిటి అని కాస్త ఏడ్చేసింది. ఇక బాలకృష్ణ సోదరి పాత్ర కోసం ఆ తర్వాత దేవయానిని సంప్రదించినట్లు వినాయక్ తెలియజేశాడు.