Begin typing your search above and press return to search.

అప్పుడు పానీపూరి వాలాపై మనసు.. ఇప్పుడు అవసరమా?

By:  Tupaki Desk   |   14 July 2021 4:07 AM GMT
అప్పుడు పానీపూరి వాలాపై మనసు.. ఇప్పుడు అవసరమా?
X
తెలుగమ్మాయి తేజస్వి మడివాడ సోషల్‌ మీడియా సెన్షేషన్‌ అనడంలో సందేహం లేదు. సినిమాల్లో లేదా బుల్లి తెరపై కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఆమె హాట్ ఫొటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా ఈమె అందాల ఆరబోత ఉంటుంది. ఈ తెలుగమ్మాయి బోల్డ్‌ ఫొటో షూట్స్ తో కొన్ని సార్లు విమర్శలు కూడా ఎదుర్కొంది. అలాంటి ఈ అమ్మడు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని షేర్‌ చేసింది. పెళ్లి విషయంలో తన యొక్క ఉద్దేశ్యంను ఫుల్‌ క్లారిటీగా చెప్పేసింది.

పానీపూరి బండి ని తోస్తున్నట్లుగా ఫొటోకు ఫోజు ఇచ్చిన తేజస్వి.. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఒక పారీ పూరి బండి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. కాని ఇప్పుడు నేను చిన్న అమ్మాయిని కాదు. పెద్దయ్యాక తెలిసింది ఏంటీ అంటే పెళ్లి అనేది అనవసర విషయం అంది. ఆమె పోస్ట్‌ తో పెళ్లిపై ఆమెకు ఆసక్తి లేదని క్లారిటీ వచ్చేసింది. గతంలో తేజస్వి ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన్ను పెళ్లి చేసుకుంటుందేమో అంటూ కూడా పుకార్లు షికార్లు చేశాయి. కాని ఆమె తాజా పరిస్థితులు మరియు ఇతర విషయాల కారణంగా పెళ్లిపై ఆసక్తిగా లేదని తేలిపోయింది.

చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి వర్మ దయతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఐస్‌ క్రీమ్‌ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించింది. కాని ఈమె అనూహ్యంగా బిగ్‌ బాస్‌ లో ఎంట్రీ ఇవ్వడం వల్ల పెద్ద మొత్తంలో నెగిటివిటీని మూట కట్టుకుంది. ఆ షో లో తేజస్వి ప్రవర్తన మరియు ఆమె తీరును కొందరు విమర్శించారు. అలా విమర్శించిన వారిని తీవ్రంగా టార్గెట్‌ చేయడంతో పాటు ఆమె తనకు తోచిన విధంగా ప్రవర్తించడం వల్ల బయట కూడా ఆమె పాపులారిటీ దెబ్బ తిన్నది. బిగ్‌ బాస్ తర్వాత ఆమె బిజీ అవుతుందని అంతా భావించారు. కాని ఆమెకు అస్సలు ఆఫర్లు లేకుండా పోయాయి. బుల్లి తెర మరియు వెండి తెర ఎక్కడ కూడా ఆమె కనిపించడం లేదు. కాని సోషల్‌ మీడియాలో మాత్రం ఈమె సందడి కొనసాగుతుంది.

సినిమా ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న తేజస్వి కి ముందు ముందు అయినా ఆఫర్లు తలుపు తడుతాయా అనేది చూడాలి. సాదారణంగానే తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో హీరోయిన్స్ గా ఆఫర్లు రావడం తక్కువ. అలాంటిది ఈమె పై కొందరు నెగటివ్‌ గా ఉండటం వల్ల ఫిల్మ్‌ మేకర్స్ ఈమెను తమ సినిమాల్లో తీసుకుని సాహసం చేయడం ఎందుకు అన్నట్లుగా ఆలోచిస్తున్నారట. తేజస్వి బిగ్‌ బాస్ లో కనిపించి ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రభావం నుండి ఆమె బయటకు రాలేక పోతుందని.. ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న హాట్‌ ఫొటో షూట్స్ తో ఆమె మరింతగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కొందరి వాదన.