Begin typing your search above and press return to search.

కమాన్ సాహో ఇక మొదలుపెట్టు

By:  Tupaki Desk   |   7 Jun 2019 2:30 PM GMT
కమాన్ సాహో ఇక మొదలుపెట్టు
X
ఆగస్ట్ 15 మరీ ఎంతో దూరంలో లేదు. గట్టిగా లెక్కేస్తే పట్టుమని డెబ్బై రోజుల లోపే వచ్చేస్తుంది. ఇప్పటిదాకా యాక్టివ్ ప్రమోషన్ ఇంకా మొదలుకానే లేదు. శంకర్ ఎహసాన్ లాయ్ లు తప్పుకున్నాక ఇంకెలాంటి అప్ డేట్ మేకర్స్ నుంచి రాలేదు. విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ అభిమానులు మాత్రం లోలోపల కాస్త టెన్షన్ గానే ఉన్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా బాలన్స్ ఉండటం రెండు పాటల చిత్రీకరణ రికార్డింగ్ తో సహా ఇంకా పూర్తి కావాల్సి ఉండటం ఇవన్నీ ఖంగారు కలిగించేవే.

అయితే టీమ్ ఊపిరిసలపనంత బిజీగా ఈ పనులు పూర్తి చేయడంలో తలమునకలైంది. ఇదంతా ఎలా ఉన్నా సాహో మీద ఎంత భారీ బజ్ ఉన్నా మెల్లగా ప్రమోషన్ స్పీడ్ పెంచాలి. హైప్ తెలుగు రాష్ట్రాల్లో వస్తే సరిపోదు. దేశమంతా ఇదే టాక్ అఫ్ ది టౌన్ గా మారాలి. దానికి తగ్గట్టు మార్కెటింగ్ వ్యూహాలు రచించాలి. కానీ ఇప్పటికింకా వాటి జాడ లేదు. ఇంకో పది పదిహేను రోజులు అయ్యాక కానీ ఇవి స్టార్ట్ అయ్యే అవకాశం లేదని ఇన్ సైడ్ టాక్. పోనీ ఓ చిన్న టీజర్ వదిలినా ఫ్యాన్స్ సర్దుకుంటారు.

చాప్టర్స్ పేరుతో వదిలిన మేకింగ్ వీడియోస్ హిట్టు కొట్టాయి కానీ టీజరో ట్రైలరో వదిలితే దాని కిక్కే వేరు. ప్రేక్షకులూ వాటి కోసమే ఎదురు చూస్తున్నారు. జూన్ ని పైన కారణాల వల్ల నిర్లక్ష్యం చేసినా జులై మాత్రం రోజుకో ప్రచారంతో హోరెత్తిపోవాలి. రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సాహో మీద బయ్యర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా చాలా డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కి ఊపిరి ఇచ్చేది సాహోనేనని వాళ్ళ నమ్మకం. మరి యువి సంస్థ దీని మీద ఇప్పటికైనా వీటిపైన దృష్టి పెడతారో లేదో చూడాలి