Begin typing your search above and press return to search.

యంగ్ టైగర్ కు క్లాప్స్ కొడుతున్న గీత

By:  Tupaki Desk   |   28 Sept 2018 1:52 PM IST
యంగ్ టైగర్ కు క్లాప్స్ కొడుతున్న గీత
X
రష్మిక మందన్న రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో తెలుగు లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తాజా చిత్రం 'దేవదాస్' కూడా పాజిటివ్ టాక్ తో ఓపెన్ అయింది. ఇదిలా ఉంటే రష్మిక నటించిన ఒక షార్ట్ ఫిలిం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షార్ట్ ఫిలిం 'ఎవిరి నాన్ తెలుగు ఫ్రెండ్ ఎవర్'.

ఇందులో తెలుగు రాని అమ్మాయి పాత్రలో రష్మిక నటించింది. రష్మిక ఫ్రెండ్ అయిన తెలుగు అమ్మాయి తెలుగు బాషను అనువాదం చేస్తూ కామెడి పండిస్తుంది. ఒక సీన్ లో ఎన్టీఆర్ సినిమా 'దమ్ము' ను చూస్తుంటారు. ఆ సీన్లో సుమోలు పైకి లేస్తుంటే యంగ్ టైగర్ పవర్ఫుల్ ఎంట్రీ ఇస్తాడు.. ఇక రష్మిక హంగామా చూడాలి. క్లాప్స్ కొడుతూ ఆ సీన్ సూపర్ అనే ఉద్దేశంతో ఒక సూపర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఒకే దెబ్బకు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను బుట్టలో పడేసింది.

అదే షార్ట్ ఫిలిం లో 'గీత గోవిందం' లో 'యాసిడ్ పోస్తా..' అని విజయ్ దేవరకొండను బెదిరించే సీన్ ఉంటుంది కదా. ఆ సీన్ చూసి తెలుగు ఫ్రెండ్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేస్తే.. నేను అలానే ఉంటాను.. నువ్వు అలానే ఉండాలి అని కసిగా చెప్పింది. మరి ఈ నాన్ తెలుగు ఫ్రెండ్ సంగతి ఏంటో మీరే చూడండి.