Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ సెట్స్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   5 Jun 2021 11:00 PM IST
పవర్ స్టార్ సెట్స్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు'.. సాగర్ కె.చంద్ర తో చేస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ సినిమాల షూటింగ్స్ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయాయి. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న పవన్.. వీలైనంత త్వరగా ఈ చిత్రాలను పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

ఆగస్ట్ నుంచి తిరిగి సెట్స్ లో అడుగుపెట్టాలని డిసైడైన పవన్.. 'ఏకే' రీమేక్ తో పాటు సమాంతరంగా 'వీరమల్లు' షూటింగ్ కూడా చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. అయితే ముందుగా '#PSPKRana' చిత్రాన్ని కంప్లీట్ చేయాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. సితార ఎంటర్టైమెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు - స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

మరోవైపు పవన్ కెరీర్ లో మొదటి పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ కూడా 45 శాతం పూర్తయ్యింది. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హయ్యెస్ట్ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దీని కోసం ఆల్రెడీ ఉన్న సెట్స్ తో పాటుగా మరికొన్ని భారీ సెట్స్ నిర్మాణం చేయాల్సి ఉందట. అందుకే ముందు 'ఏకే' రీమేక్ ని కంప్లీట్ చేసి.. 'వీరమల్లు' ని సంక్రాంతి కి రెడీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.