Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కధీరుని యూనివ‌ర్శ్ ఫిలింస్ ఎప్పుడు?

By:  Tupaki Desk   |   3 Feb 2022 4:30 AM GMT
ద‌ర్శ‌కధీరుని యూనివ‌ర్శ్ ఫిలింస్ ఎప్పుడు?
X
హాలీవుడ్ లో సూప‌ర్ హీరో ఫ్రాంఛైజీ సినిమాల వెల్లువ‌లో పుట్టుకొచ్చిందే - విశ్వం కాన్సెప్ట్. యూనివ‌ర్శ్ అంటూ ప్ర‌యోగాలు పెద్ద స‌క్సెస‌వుతున్నాయి. కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ సూప‌ర్ మేన్ సినిమాల‌ ఫ్రాంఛైజీల నుంచి కొన్ని పాత్ర‌ల‌ను ఎంపిక చేసి ఆ పాత్ర‌ల‌న్నిటినీ క‌లిపి యూనివ‌ర్శ్ పేరుతో మ‌రో భారీ సూప‌ర్ హీరో సినిమాని తీసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా పాత్ర‌ల అభిమానుల నుంచి క‌లెక్ష‌న్లు దండుకోవ‌డం అన్న ఫార్ములా ఒక రేంజులో వ‌ర్క‌వుటైంది.

ఇప్పుడు ఇదే విధానాన్ని అనుస‌రిస్తూ బాలీవుడ్ లోనూ యూనివ‌ర్శ్ కాన్సెప్టుల‌తో సినిమాలు తీసేందుకు క్రేజీ ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇటీవ‌ల ఖాన్ లు .. రోష‌న్ ల‌ను క‌లిపి యూనివ‌ర్శ్ ఫ్రాంఛైజీలో సినిమాలు తీస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇందులో స‌ల్మాన్ ఖాన్ - షారూక్ ఖాన్ - అమీర్ ఖాన్ ల‌తో పాటు హృతిక్ రోష‌న్ లాంటి స్టార్ యాడ‌వుతున్నారు. దీనికి సౌత్ స్టార్ల‌ను కూడా యాడ‌ప్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఇటీవ‌ల క్రేజ్ పెంచుకున్న సౌత్ స్టార్లుగా ప్ర‌భాస్ - య‌ష్ - బ‌న్నిల‌కు గొప్ప గుర్తింపు ఉంది. వీళ్ల‌లో ఎవ‌రికైనా ఈ యూనివర్శ్ లో సూప‌ర్ హీరోగా న‌టించే వీలుంది.

అంతా బాగానే ఉంది కానీ.. ఇదే క‌ల్చ‌ర్ టాలీవుడ్ కి వచ్చేదెప్పుడు? ఎవ‌రు తెస్తారు? అంటే ఆ స‌త్తా క‌చ్ఛితంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికే ఉంది. ఇక్క‌డా రాజ‌మౌళి ఏదైనా యూనివ‌ర్శ్ (విశ్వం) ని ప్లాన్ చేస్తారా? హిందీ- తెలుగు స్టార్ల‌ను క‌లిపి ఈ త‌ర‌హా ప్ర‌య‌గం చేస్తారా? అన్న‌ది చూడాలి. అయితే ఇండియ‌న్ వెర్ష‌న్ సూప‌ర్ హీరోలు గా అంద‌రికీ గుర్తింపు లేదు. ఒక్క హృతిక్ రోష‌న్ మిన‌హా ఇత‌ర హీరోలంతా సాధార‌ణ పాత్ర‌ల‌తోనే అల‌రించారు.

ప్రభాస్ బాహుబ‌లి సాహోతో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లు ట్రై చేశాడు . అత‌డికి యాక్ష‌న్ స్టార్ ఇమేజ్ ప్ల‌స్ అవుతుంది. అయితే సూప‌ర్ హీరో త‌ర‌హా స్క్రిప్టుల్లో న‌టించేవారికి యూనివ‌ర్శ్ కాన్సెప్టులు వ‌ర్క‌వుట‌వుతాయి. ఆ దిశ‌గా ఇంకా టాలీవుడ్ నుంచి హీరోలు ఎవరూ ఎదిగ‌లేదు. ఒక‌వేళ సూప‌ర్ హీరో కాన్సెప్టులు.. లార్జ‌ర్ దేన్ లైఫ్ క్యారెక్ట‌ర్ల‌తో తొలిగా జ‌నంలోకి దూసుకెళ్లాక త‌ర్వాత యూనివ‌ర్శ్ ప్ర‌యోగాలకు ఆస్కారం ఉంటుంది. కానీ అంత దూరం వెళ్లాలంటే ఇంకా చాలాకాలం ప‌డుతుందుందేమో! బ‌డ్జెట్ల ప‌రంగా కూడా ఈ మోడ‌ల్ మ‌న‌కు వ‌ర్క‌వుట‌వుతుందా? అన్న‌దానిపై మేక‌ర్స్ చాలా వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది.