Begin typing your search above and press return to search.
ఆ సినిమాల్లో వీల్ ఛెయిరూ హీరోనే
By: Tupaki Desk | 25 March 2016 12:59 PM ISTనాగార్జున నటించిన 'ఊపిరి' సినిమా చాలామందిని ఆకర్షిస్తోంది. అగ్రహీరోల్లో ఒకరైన ఆయన చక్రాల కుర్చీలో కూర్చుని కనిపించడంతోనే ఇదేదో డిఫరెంటు సినిమా అన్నది అందరినీ అర్థమవుతోంది. ఇలంటిపాత్ర ఎప్పుడో కానీ హీరోల తలుపు తట్టవని సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాగార్జునే చెప్పుకొచ్చారు. తాజాగా రిలీజైన ఊపిరి నాగార్జున మరో విజయం అందిస్తుందనడంలో సందేహాలు లేవు. అందుకు సెంటిమెంటు కూడా కారణమవుతోంది. ఎందుకంటే చక్రాల కుర్చీ సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాయట.
గతంలో అగ్రనటులు అలాంటి పాత్రల్లో నటించడమే కాక పక్కనున్న హీరోయిన్ తో కూడా నటింపజేసి మహిళా ప్రేక్షకులను సకుటుంబ సమేతంగా సినిమా హాళ్ల దగ్గరకు రప్పించేవారు. నిర్మాతకు కాసుల వర్షం కురిపించేవారు. 'గుడిగంటలు' నుంచి 'కొండవీటి సింహం' దాకా అలనాటి అగ్రహీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ గురించి. 1960 దశకంలో 'గుడిగంటలు' చిత్రం వచ్చింది. ఎన్టీఆర్ లో వైవిధ్యమైన నటుడ్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆయనకు తోడుగా తెరపై చక్రాల కుర్చీ కనిపించింది. చిత్రం విజయవంతమైంది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నంది పురస్కారాన్ని నిర్మాత ఇంటికి తెచ్చి పెట్టింది. ఆ తర్వాత 'సుఖదు:ఖాలు' సినిమా వచ్చింది. చిత్రానికి కీలకమైన అంధుని పాత్ర పోషించిన ఎస్.వి.రంగారావు అక్కడక్కడా చక్రాల కుర్చీలో కనిపించారు. ప్రేక్షకుల కంటతడి పెట్టించారు. దర్శక - నిర్మాతలకు కీర్తిని - కనకాన్ని అందించారు. కుర్చీతో ముఖ్యభూమిక పోషించే అవకాశం ఈసారి మళ్లి ఎన్టీఆర్ కు వచ్చింది. 1980 దశకం మొదట్లో 'కొండవీటి సింహం' సినిమా వచ్చింది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో నటించారు ఎన్టీఆర్. పెద్ద ఎన్టీఆర్ కు భార్యగా జయంతి నటించారు. భార్య అనారోగ్యం పాలైనప్పుడు ఆమెను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి 'మా ఇంటిలోన మహలక్ష్మి నీవే' అని పాడుతూ పెద్ద ఎన్టీఆర్ సపర్యలు చేస్తుంటే 'మా అమ్మ నీవై కనిపించినావు' అంటూ చిన్న ఎన్టీఆర్ వచ్చి మహిళా ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తారు. చక్రాల కుర్చీతో ఫ్యామిలీ సెంటిమెంట్ పండించిన దర్శకుడనే ఖ్యాతిని కె.రాఘవేంద్ర రావు మూటగట్టుకున్నారు.
అదే బాటలో 'గృహప్రవేశం' సినిమా వచ్చింది. మోహన్ బాబు - జయసుధ హీరోయిన్లు. అనారోగ్యం పాలైన జయసుధను చక్రాల కుర్చీలో తిప్పుతూ 'దారి చూపిన దేవత' అని పాట అందుకుంటారు హీరో మోహన్ బాబు. హీరో కూడా భార్యకు సపర్యలు చేయడానికి ముందుకొచ్చేసరికి కరిగిపోయారు తెలుగు సినీ ప్రేక్షకులు. 'గృహప్రవేశం' చేయడానికి బారులు తీరారు. నిర్మాత ఇంట సిరుల పంట పండించారు. అన్ని రకాల పాత్రలు పోషించిన అక్కినేని నాగేశ్వరరావు నేను మాత్రం దీంతో ఎందుకు నటించకూడదు అని అనుకున్నట్టున్నారు. దాసరినారాయణరావును పురమాయించారు. అన్నీ తానై దాసరి రూపొందించిన 'బహుదూరపు బాటసారి' చిత్రంలో చక్రాల కుర్చీతో నటించారు. పనిలోపనిగా చేతి ఊత కర్రలతో దొంగలను చితక్కొట్టేశారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. ఆ తర్వాత ఎందుకో గానీ చక్రాల కుర్చీకి కాస్త గ్యాప్ వచ్చింది. సింగిల్ హ్యాండ్ తో వెంకటేష్ కు హిట్ కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకుపోయినట్టుగా సినిమారంగంలోనూ కొత్త తరం వచ్చింది. అయినా కానీ చక్రాల కుర్చీ పాతబడిపోలేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా 1990 దశకంలో 'గణష్' సినిమా వచ్చింది. హీరోకు స్నేహితురాలిగా 'రోజా' చిత్రంతో యువ ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన మధుబాల నటించింది. విలన్ల భరతం పట్టే జర్నలిస్టు పాత్రలో నటించింది. జర్నలిస్టు ధోరణి సహించలేని విలన్లు ఆమెపై దాడి చేస్తారు. మధుబాల ఆశయానికి చక్రాల కుర్చీ ఆశ్రయమిస్తే.. హీరో వెంకటేష్ ఆయుధంగా మారుతాడు. విలన్ల పనిపడతాడు. సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వెంకటేష్ ఖాతాలో సూపర్ హిట్ ను చేర్చింది.
కామెడీ పండించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల సైతం చక్రాల కుర్చీకున్న ఇమేజ్ ను ఇట్టే పట్టేశారు. నాగార్జున హీరోగా వచ్చిన 'కింగ్' సినిమాలో కామెడీ సీన్లలో దానికి కీలక పాత్ర అప్పగించారు. ప్రేక్షకులు కూడా నవ్వుకుంటూ థియేటర్ల నుంచి ఇంటి ముఖం పట్టారు. నిర్మాతను సేఫ్ జోన్ లో ఉంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే చక్రాల కుర్చీ ఉన్న చిత్రాలు మనకెన్నో గుర్తుకొస్తాయి. ఒక్క కామెడీయే కాదు విషాదాన్ని సైతం అంతే స్థాయిలో పండించగలనని 'మాతృదేవోభవ' చిత్రంతో తనను తాను నిరూపించుకుంది ఈ నిర్జీవ ఆసనం. 'ఊపిరి' చిత్రం ద్వారా మరోసారి నాగార్జున సినిమాలో కనిపిస్తున్న ఈ చక్రాల కుర్చీ చిత్ర యూనిట్ కు అచ్చి వస్తుందా లేదా తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. కింగ్ తరువాత నాగార్జున సినిమాల్లో ఈ ఊపిరి మరోసారి చక్రాల కుర్చీతో వచ్చింది.