Begin typing your search above and press return to search.

వేవ్ తో ప‌నేం ఉంది? శంక‌ర్ రెడీగా ఉంటే..!

By:  Tupaki Desk   |   20 April 2021 9:30 AM GMT
వేవ్ తో ప‌నేం ఉంది? శంక‌ర్ రెడీగా ఉంటే..!
X
ఓవైపు సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. జ‌నాల్ని భ‌య‌పెడుతోంది. దీంతో ఒక్క‌సారిగా దేశం రాష్ట్రాలు అలెర్ట‌య్యాయి. మ‌రో రెండు నెల‌ల్లో ఈ వేవ్ ని అణ‌చివేయ‌క‌పోతే తీవ్ర ముప్పు ఉంటుంద‌ని అర్థ‌మైంది. అలాగే క‌రోనా తో స‌హ‌జీవ‌నానికి చాలా వ‌ర‌కూ మాన‌సికంగా జ‌నం కూడా ప్రిపేరై ఉన్నారు. సినీజ‌నం ఇంకా ప్రిపేర్డ్ గా మారేందుకు ఆస్కారం ఉంది. మాన‌వుడిని మొండిగా మార్చేదే కరోనా అని సీన్ చెబుతోంది.

చూస్తుంటే రామ్ చ‌ర‌ణ్ కూడా క‌రోనా వేవ్ ని కేర్ చేసేట్టు లేడు. ఇప్ప‌టికే అత‌డికి ఓసారి కరోనా పాజిటివ్ వ‌స్తే చికిత్స‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇటీవ‌ల సోనూ సూద్ ని క‌లిశాక మ‌రోసారి ఐసోలేష‌న్ లోకి వెళ్లాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. అందుకేనేమో స‌హ‌జీవ‌నం అల‌వాటు ప‌డ్డాక ఇక అది ఏం చేస్తుంది.. అనుకుంటున్నాడో ఏమో..రాజ‌మౌళితో ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్ ముగించేసి.. అటుపై ఆచార్య రిలీజ్ స‌వ్యంగా సాగిపోతే వెంట‌నే శంక‌ర్ తో సినిమాని మొద‌లెట్టేయాల‌ని ప్రిపేర‌వుతున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే త‌న బాడీ లాంగ్వేజ్ ని మార్చుకునేందుకు షెడ్యూల్ ని ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్ చార్ట్ ని సిద్ధం చేశాడ‌ని చెబుతున్నాడు. అత‌డు ధృవ‌గా మారేందుకే ఎంత‌టి ప్ర‌ణాళిక‌ను క‌న‌బ‌రిచాడో అప్ప‌ట్లోనే అర్థ‌మైంది. ఈసారి ఏకంగా ఇండియ‌న్ జేమ్స్ కామెరూన్ శంక‌ర్ తోనే ప‌ని చేస్తున్నాడు కాబ‌ట్టి మేకోవ‌ర్ ప‌రంగా చాలా చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తాడ‌న‌డంలో సందేహ‌మేం లేదు. చూస్తుంటే ఇప్పుడు చెర్రీలో ఆచార్య‌-ఆర్.ఆర్.ఆర్ టెన్ష‌న్ కంటే శంక‌ర్ తో అటెన్ష‌న్ గురించే ఆలోచిస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ చిత్రీక‌ర‌ణ‌ను చరణ్ జూన్ నాటికి ప్రారంభించే క‌సితో ప్రిపేర‌వుతున్నాడ‌ట‌. క‌థానాయిక‌గా ర‌ష్మిక లేదా కియ‌రా ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు న‌టించే వీలుంది. ఇత‌ర కాస్టింగ్ పాన్ ఇండియా అప్పీల్ తో ఉంటుంద‌ట‌. సంఘంలో ప్ర‌జ‌ల కోసం నిజాయితీగా ప‌ని చేసే ఒక సిన్సియ‌ర్ ఐఏఎస్ సీఎం అయితే ఎలా ఉంటుందో తెరపై చూపించ‌నున్నారు. ఇందులో చ‌ర‌ణ్ ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్లో ఆహార్యం ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంద‌ని అన్నియ‌న్ రేంజులో వైవిధ్యం చూపించాల్సి ఉంటుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.