Begin typing your search above and press return to search.

2050 నాటికి మాన‌వ ప్ర‌పంచం ఎలా ఉంటుంది?

By:  Tupaki Desk   |   7 Nov 2020 11:15 AM IST
2050 నాటికి మాన‌వ ప్ర‌పంచం ఎలా ఉంటుంది?
X
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం `జెర్సీ`. ఈ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన క‌న్న‌డ సోయ‌గం శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌. స‌హ‌జ‌మైన న‌టిగా ప్ర‌శంస‌లు పొందిన శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ఆ త‌రువాత తెలుగు.., త‌మిళ భాష‌ల్లో వ‌రుస ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంది. త్వ‌ర‌లో విశాల్ హీరోగా న‌టించిన ద్విభాషా చిత్రం `చ‌క్ర‌` ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇదిలా వుంటే తాజాగా శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని అంగీక‌రించింది.

తెలుగు,.. త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ప్ర‌మోద్ సుంద‌ర్ రూపొందించ‌బోతున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొంద‌నున్న ఈ మూవీ 2050 టైమ్ పిరియ‌డ్ నేప‌థ్యంలో సాగుతుందని తెలుస్తోంది. అడ్వాన్స్ స్టేజ్ లో 30ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

చెన్నై నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి `క‌ల‌యుగం` అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఆర్కే ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. త‌న కెరీర్ లో ఇదొక విభిన్న‌మైన సినిమా అని ఇలాంటి చిత్రంలో న‌టించ‌డం చాలా ఎగ్జైటింగ్ గా వుంద‌ని న‌టి శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది.

ఇంత‌కుముందు టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సింగీతం శ్రీ‌నివాస‌రావు ఆదిత్య 369 చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమా హిస్ట‌రీలో క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయిన ఈ మూవీలో నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించారు.