Begin typing your search above and press return to search.

దీనర్థం ఏంటి దేవసేనా..?

By:  Tupaki Desk   |   28 Oct 2018 6:07 PM IST
దీనర్థం ఏంటి దేవసేనా..?
X
ఇప్పటికే తెలుగువాళ్ళకు చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఒకరు ఆపరేషన్ గరుడ అంటారు ఇంకొకరు దాన్ని ఆపరేషన్ వెర్రి పువ్వు.. అని ఎగతాళి చేస్తారు. ఆ గరుడ ఏంటో ఇప్పటి వరకూ ఒక్కరికైనా తెలిస్తే ఒట్టు. రాజకీయ నాయకులంటే సరే గానీ సినిమా యాక్టర్లు కూడా కన్ఫ్యూజన్ పెంచితే ఎలా? కానీ కన్నడ బ్యూటీ - టాలీవుడ్ స్వీటీ మాత్రం కన్ఫ్యూజన్ పెంచే ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అనుష్క తన పాదంతో ఒక చిన్న మొక్కను టచ్ చేసింది. అంది ఎలా ఉంది అంటే ఎడమకాలి బొటనవేలు - చూపుడు వేలు మధ్యలో ఉండడంతో కాలి మెట్టెల డిజైన్ లా అనిపిస్తోంది. ఈ ఫోటో పోస్ట్ చేయడంతో పాటుగా 'క్యాప్షన్ అవసరం లేదు' అనే క్యాప్షన్ ఇచ్చి ఓ లవ్ ఎమోజి ని జోడించింది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? త్వరలో పెళ్ళి కి రెడీ అవుతున్నాను అని చెప్పినట్టేనా? ఏమో ఎవరికి తెలుసు?

ఈ ఫోటో సంగతేమోగానీ అనుష్క ప్రస్తుతం నార్వేలోకే ఒక ఫేమస్ స్పా లో వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుంటోందని.. అక్కడ న్యాచురల్ పద్దతుల్లో వెయిట్ తగ్గిస్తారని వార్తలు వచ్చాయి. మరి ట్రీట్మెంట్ అయిపోగానే మునుపటి స్వీటీలా స్లిమ్ముగా మారి అందరికీ సర్ప్రైజ్ ఇస్తుందేమో వేచి చూడాలి.