Begin typing your search above and press return to search.

ఒకప్పుడు ఎంత ఖాళీ ఉందో ఇప్పుడు అంత బిజీ అయ్యింది

By:  Tupaki Desk   |   9 July 2021 1:30 AM GMT
ఒకప్పుడు ఎంత ఖాళీ ఉందో ఇప్పుడు అంత బిజీ అయ్యింది
X
దివి పేరు బిగ్ బాస్ సీజన్‌ 4 కు ముందు వరకు పెద్దగా ఎవరికి తెలియదు. కొన్ని సినిమాల్లో కనిపించినా కనీసం నోటీస్ చేసేంత స్క్రీన్ టైమ్ కూడా ఆమెకు లభించలేదు. ఇక ఆమె కనీసం డైలాగ్ ఆర్టిస్టుగా కూడా గుర్తింపు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. అలాంటి దివి సోషల్‌ మీడియాలో కాస్త హడావుడి చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంది. బిగ్‌ బాస్‌ లో ఉన్నది కొన్నాళ్లే అయినా కూడా దివికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఫినాలే ఎపిసోడ్‌ రోజు చిరంజీవి మాట్లాడుతూ తన సినిమాలో ఆఫర్‌ ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.

చిరంజీవి వంటి స్టార్‌ ఆమె అందంను పొగడటం తో పాటు ఆమె కు ఆఫర్‌ ను ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు అంటే ఆమె రేంజ్‌ ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అనుకున్నట్లుగానే దివి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ఒకప్పుడు సినిమాల్లో ఆఫర్ కోసం ఏకంగా వంద ఆడిషన్స్ కు వెళ్లిన దివి ఎన్నో చోట్ల నో అనిపించుకుందట. కొన్ని చోట్ల పిలిచి మరీ అవమానించారట. అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు కనీసం తీరిక లేకుండా బిజీ అయ్యింది. వెబ్‌ సిరీస్‌ లు.. సినిమాలు.. ప్రైవేట్ సాంగ్స్‌.. కమర్షియల్‌ యాడ్స్‌.. సోషల్‌ మీడియా ఫొటో షూట్స్.. ఇంటర్వ్యూలు.. టీవీ షో లు ఇలా ఎన్నో రకాలుగా బిజీ బిజీగా దివి ఉంది.

అప్పుడు వారంలో ఒక్క రోజు అవకాశం వస్తే గొప్ప విషయంగా భావించే దివి ఇప్పుడు కనీసం వారంలో ఒక్క రోజు కూడా తిరిక లేనంత బిజీ అయ్యింది అంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌ బాస్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె ను ఒక్కసారిగా స్టార్‌ ను చేయడం తో పాటు లక్‌ ను తెచ్చి పెట్టింది. చిరంజీవితో మూడు నెలల్లో సినిమా ను చేయబోతున్నట్లుగా దివి ఇటీవల చెప్పుకొచ్చింది. చిరంజీవి తో కలిసి నటించబోతున్న ఆ సందర్బం కోసం వెయిట్‌ చేస్తున్న దివి ఆ తర్వాత మరింతగా పెద్ద ఆఫర్లు హీరోయిన్‌ గా పెద్ద సినిమాల్లో ఛాన్స్ లను దక్కించుకుంటుందేమో చూడాలి.

సోషల్‌ మీడియాలో అత్యధికంగా ఫాలోయింగ్‌ ను దక్కించుకోవడంతో పాటు ఎక్కువ చర్చ జరిగినందుకు గాను ఈ ఏడాదికి గాను మోస్ట్‌ డిజైరబుల్‌ సెలబ్రెటీగా దివి నిలిచిన విషయం తెల్సిందే. ఆ ఘనతతో ఈమెకు ఫాలోయింగ్‌ మరియు పాపులారిటీ మరింతగా పెరిగింది. ముందు ముందు దివి ఒక మంచి కమర్షియల్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.