Begin typing your search above and press return to search.
'వాట్ ద ఎఫ్' అంటూ విజయ్ సంచలనం
By: Tupaki Desk | 25 July 2018 12:12 PM ISTఅర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు హీరో విజయ్ దేవరకొడ.. యూత్ సెన్షేషన్ స్టార్ గా మారిపోయాడు. విజయ్ ఎంచుకునే సినిమాలన్నీ చాలా ఆసక్తిగా ఉన్నాయి. తాజాగా ఇతడి లేటెస్ట్ సినిమా ‘గీతాగోవిందం’. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. యూత్, లవ్ రోమాంటిక్ కథతో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఛలో ఫేం రష్మికా మందానా హీరోయిన్.
ఆగస్టు 15న విడుదలవుతున్న ఈ మూవీ ప్రమోషన్ ను వినూత్నంగా మొదలు పెట్టింది చిత్రం యూనిట్ . తొలిసారిగా హీరో విజయ్ దేవరకొండ పాడిన పాటను గురువారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ‘వాట్ ద ఎఫ్’ అంటూ సాగే ఈ పాటను విజయ్ ఆలపించగా.. గోపిసుందర్ సంగీతమందించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ - ఫస్ట్ లుక్ లో విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విజయ్ స్వయంగా పాట పాడడంతో సినిమాకు బాగా ప్రచారం దక్కుతోంది. మరో మూడు వారాలు ఉండడంతో సినిమా ప్రమోషన్ ను వినూత్నంగా చేసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు చిత్రం యూనిట్ రెడీ అయ్యింది.