Begin typing your search above and press return to search.

'సుకుమార్-విజయ్' ప్రాజెక్ట్ పై మేకర్స్ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   19 April 2021 2:00 PM IST
సుకుమార్-విజయ్ ప్రాజెక్ట్ పై మేకర్స్ క్లారిటీ..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫాల్కన్‌ క్రియేషన్స్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్‌ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీంతో పాన్ ఇండియా వైడ్ రూపొందనున్న ఈ సినిమాపైసినిమాపై ప్రత్యేకమైన క్రేజ్‌ ఏర్పడింది. అల్లు అర్జున్‌ తో ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్న సుకుమార్‌.. ఇది పూర్తి చేసిన వెంటనే విజయ్‌ సినిమా మీద వర్క్ స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు. అయితే గత రెండు రోజుల నుంచి 'సుకుమార్‌-విజయ్‌' సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని.. సుక్కూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫాల్కన్‌ క్రియేషన్స్ టీమ్ ఈ వార్తలను ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

డైరెక్టర్ సుకుమార్ - హీరో విజయ్ దేవరకొండ కమిట్మెంట్స్ పూర్తైన వెంటనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో 2022 లోనే ఈ సినిమా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ''ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి ప్రతిష్టాత్మక తొలి ప్రాజెక్టును ప్రకటించింది. హీరో మరియు డైరెక్టర్ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రారంభమవుతుంది. కొన్ని విభాగాలు స్ప్రెడ్ చేస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దు. ఇలాంటి గాసిప్‌ లను, తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 'సుకుమార్-VD-ఫాల్కన్' కలయిక బిగ్గర్ గా ఉండబోతోంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు'' అని ఫాల్కన్ టీమ్ ప్రకటనలో పేర్కొన్నారు.