Begin typing your search above and press return to search.

ప‌ర్ఫెక్ష‌న్ కోసం సాయి ప‌ల్ల‌వి ఏం చేసిందో తెలుసా?

By:  Tupaki Desk   |   15 Jun 2022 12:30 PM GMT
ప‌ర్ఫెక్ష‌న్ కోసం సాయి ప‌ల్ల‌వి ఏం చేసిందో తెలుసా?
X
సినిమా అంటేనే గ్లామ‌ర్ ప్ర‌పంచం.. కెమెరా ముందుకు వ‌చ్చే ప్ర‌తీ ఆర్టిస్ట్ గ్లామ‌ర్ గా వుండాల‌ని, స్క్రీన్ పై మ‌రింత అందంగా క‌నిపించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇందు కోసం ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ ఆర్టిస్ట్ ల‌ని పెట్టుకుని తెర‌పై అందంగా క‌నిపించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. గ్లామ‌ర్ త‌గ్గిందా? అస్స‌లు ఊరు కోరు. కెమెరామెన్ త‌మ‌ని మ‌రింత అందంగా చూపించాల‌ని అనుకుంటుంటారు. కానీ సాయి ప‌ల్ల‌వి మాత్రం అందుకు భిన్నంగా పాత్ర ప‌ర్ఫెక్ష‌న్ కోసం సాహ‌సం చేసింద‌ట‌.

వివ‌రాల్లోకి వెళితే.. రానా, సాయి ప‌ల్లవి జంట‌గా న‌టించిన చిత్రం 'విరాట‌ప‌ర్వం'. వేణు ఊడుగుల అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించారు. 1990 కాలంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. న‌క్స‌లిజంని ప్రధాన ఇతివృత్తంగా చూపిస్తూ ఓ యువ‌తి క‌థ‌గా ఈ మూవీని రూపొందించారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ ఏడాది ఆల‌స్యంగా జూన్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో మూవీ టీమ్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల జోరు పెంచింది. కీల‌క న‌టీన‌టులు ప‌లు మీడియా సంస్థ‌ల‌తో ప్ర‌త్యేకంగా ఇంట‌రాక్ట్ అవుతున్నారు. హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి కూడా జోరుగా ఈ సినిమాకు త‌న వంతు ప్ర‌చారం చేస్తోంది.

ఇందు కోసం ప‌లు సంస్థ‌ల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది. సినిమాకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌తో పాటు వ్య‌క్తిగత విష‌యాల్ని కూడా వెల్ల‌డిస్తూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌ను పోషించిన వెన్నెల పాత్ర మ‌రింత ప‌ర్ఫెక్ష‌న్ తో రావ‌డానికి మేక‌ప్ లేకుండా న‌టించింద‌ట‌. సినిమాలో తాను వెన్నెల పాత్ర‌లో క‌నిపిస్తాన‌ని, సాధ్య‌మైనంత వ‌ర‌కు ఈ పాత్ర స‌హ‌జంగా చేయ‌డానికి ప్ర‌య‌త్నించాన‌ని తెలిపింది. అంతే కాకుండా సాధార‌ణంగా నేను మేక‌ప్ త‌క్కువ‌గా వేసుకుంటాన‌ని అయితే ఈ సినిమా కోసం మేక‌ప్ లేకుండానే న‌టించాన‌ని తెలిపింది.

షాట్ రెడీ అన‌గానే ముఖం క‌డుక్కుని కెమెరా ముందుకు వెళ్లిపోయేదాన్ని అని స్ప‌ష్టం చేసింది. పాత్ర స‌హ‌జ‌త్వం కోసం అలా చేయాల్సి వ‌చ్చింద‌ని, అందుకే సినిమాలో గ్రామీణ నేప‌థ్యంలో పెరిగిన అమ్మాయిలా క‌నిపిస్తాన‌ని తెలిపింది.