Begin typing your search above and press return to search.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణలో రానా ఏం చెప్పారంటే..?
By: Tupaki Desk | 9 Sept 2021 2:03 PM ISTటాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో హీరో రానా దగ్గుబాటి నిన్న బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రానా తన బ్యాంక్ స్టేట్మెంట్స్ పలు డాక్యుమెంట్లతో ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయనతో పాటుగా తన చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉన్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయెల్ నేతృత్వంలో రానా విచారణ జరిగింది.
మనీలాండరింగ్ మరియు ఫెమా నిబంధనల ఉల్లంఘనల కోణంలో ఈడీ అధికారులు రానా ను విచారించారు. బ్యాంక్ అకౌంట్ స్టేటమెంట్స్ ని పరిశీలించి.. అనుమానాస్పద లావాదేవీలపై వివరణ తీసుకున్నారని తెలుస్తోంది. ఎఫ్ క్లబ్ పార్టీలో జరిగిన ఆర్థిక లావాదేవీలపైనా అధికారులు ప్రధానంగా ప్రశ్నించారు. అలానే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ మాస్కెరాన్స్ తో పరిచయం గురించి రానా ను ప్రశ్నించగా.. తనకు కెల్విన్ ఎవరో తెలియదని రానా సమాధానం చెప్పినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ను అధికారులు నిన్న మధ్యాహ్నం సమయంలో ఈడీ ఆఫీస్ కు తీసుకొచ్చారు. రానా - కెల్విన్ లను కలిపి దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారని తెలిసింది. సాయంత్రం 5.30 గంటలకు రానా విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విచారణలో, రానా విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన లావాదేవీలపైనా ఈడీ ఆరా తీసిందట. రానా ఎంక్వైరీ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయే సమయంలో మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
వాస్తవానికి 2017లో ఎక్సైజ్ శాఖ సిట్ జరిపిన విచారణలో రానా దగ్గుబాటి పేరు లేదు. అయితే ఫిలిం నగర్ లోని ఎఫ్ క్లబ్ లో నాలుగేళ్ళ క్రితం నిర్వహించిన ఒక పార్టీలో రానా పాల్గొనడం.. అదే పార్టీలో కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసారని ఈడీ గుర్తించడంతో ఇప్పుడు రానా కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడు జరిగిన ఆర్థికలావాదేవీలపై ఈడీ అధికారులు బుధవారం రానా ను ప్రశ్నించారు. కెల్విన్ తో పరిచయం ఉందనే కోణంలో విచారించగా.. అతనెవరో తెలియదని రానా సమాధానం ఇచ్చారు.
ఇకపోతే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - రకుల్ ప్రీత్ సింగ్ - నందు - రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈరోజు గురువారం హీరో రవితేజ మరియు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ ముందుకు వచ్చారు. 2017లో ఎక్సైజ్ అధికారులు వీరిద్దరిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో నవదీప్ - ఎఫ్ క్లబ్ మేనేజర్ - ముమైత్ ఖాన్ - తరుణ్ - తనీష్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు.