Begin typing your search above and press return to search.

నిత్యా .. ఎందుకో ఈ దీర్ఘాలోచ‌న‌?

By:  Tupaki Desk   |   7 Jun 2019 6:23 AM GMT
నిత్యా .. ఎందుకో ఈ దీర్ఘాలోచ‌న‌?
X
టాలీవుడ్ లో ఎంద‌రు క‌థానాయిక‌లు ఉన్నా నిత్యా వెరీ స్పెష‌ల్. సౌంద‌ర్య త‌ర్వాత అంత‌టి పాపులారిటీ ద‌క్కించుకున్న మేటి ప్ర‌తిభావ‌ని. అయితే టాలీవుడ్ లో కెరియ‌ర్ ప‌రంగా పీక్స్ లో ఉన్న‌ప్పుడే ఈ అమ్మ‌డు ఉన్న‌ట్టుండి సైడ్ లైన్ లోకి వెళ్లిపోవ‌డం అభిమానుల్ని నిరాశ‌ప‌రిచింది. అయితే వ్య‌క్తిత్వ ప‌రంగా దూకుడు ప్ర‌ద‌ర్శించి కొన్ని చిక్కుల్ని కొని తెచ్చుకుంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలొచ్చినా సూటిగా ఉండే త‌న మ‌న‌స్త‌త్వం వ‌ల్ల ఛాన్సులు కోల్పోయింది. అయినా ఇప్ప‌టికీ నిత్యాకి సౌత్ లో ఎలాంటి ఢోఖా లేదు. కెరియ‌ర్ ప‌రంగా వ‌చ్చిన ఇబ్బంది అస‌లే లేదు.

ప్ర‌స్తుతం త‌మిళంలో రెండు సినిమాల్లో న‌టిస్తోంది. వీటిలో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `ది ఐర‌న్ లేడీ` టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్త‌వుతోంది. దీంతో పాటే సైకో అనే వేరొక క్రైమ్ థ్రిల్ల‌ర్ లోనూ నిత్యా కీల‌క పాత్ర పోషిస్తోంది. హిందీలో `మిషన్‌ మంగళ్‌` అనే భారీ మ‌ల్టీస్టార‌ర్ లోనూ నిత్యా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు మ‌ల‌యాళంలోనూ కొన్ని సినిమాల్లో న‌టించేందుకు సంత‌కాలు చేసింది. అలాగే డిజిట‌ల్ మీడియాపైనా నిత్యా ప్ర‌స్తుతం ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంది.

`బ్రీత్- సీజ‌న్ 2` వెబ్ సిరీస్ లోనూ నిత్యా న‌టించింది. తొలి సీజ‌న్ లో మ్యాడీ (మాధ‌వ‌న్) క‌థానాయ‌కుడిగా న‌టిస్తే రెండో సీజ‌న్ లో అభిషేక్ బ‌చ్చ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. దిగ్గ‌జాల‌తో క‌లిసి నిత్యా ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. ఆ క్ర‌మంలోనే నిన్న‌టితో `బ్రీత్ 2` షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో నిత్యా త‌న హ్యాపీనెస్ ని సోష‌ల్ మీడియాలో వ్య‌క్తం చేసింది. ఇక‌పైనా బ్రీత్ స్ఫూర్తితో మ‌రిన్ని వెబ్ సిరీస్ ల‌లో న‌టించేందుకు నిత్యా సంసిద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు సామాజిక మాధ్య‌మాల్లో నిత్యా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. అయితే తెలుగులో స్ట్రెయిట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌క‌పోవ‌డంపై అభిమానులు మాత్రం కాస్తంత గుర్రుగానే ఉన్నారు. మ‌రి ఫ్యాన్స్ కి నిత్యా ఏమ‌ని స‌మాధానం చెబుతుందో?