Begin typing your search above and press return to search.

ఓ బేబీ తర్వాత నెక్స్ట్ ఏంటి ?

By:  Tupaki Desk   |   3 Aug 2019 1:30 AM GMT
ఓ బేబీ తర్వాత నెక్స్ట్ ఏంటి ?
X
కేవలం సమంతా ఇమేజ్ ని బేస్ చేసుకుని దర్శకురాలు నందిని రెడ్డి తీసిన కొరియన్ రీమేక్ ఓ బేబీ ఎట్టకేలకు సూపర్ హిట్ స్టాంప్ తో బయటపడి యుఎస్ లో క్రేజీ హీరోలు సైతం అంత ఈజీగా సాధించలేని వన్ మిలియన్ మార్క్ ని అందుకుని మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. నందిని రెడ్డి ఈ స్థాయిలో హిట్ ఇచ్చి చాలా కాలమయ్యింది. ఈ మధ్యకాలంలో ఇంత డీసెంట్ ఓపెనింగ్స్ తో పాటు కొంత బెటర్ రన్ దక్కించుకున్న మూవీ కూడా ఓ బేబీనే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది.

ఇదిలా ఉండగా ఇంత విజయం సాధించినప్పుడు ఆ డైరెక్టర్ కు వరసగా ఆఫర్స్ రావడం సహజం. కానీ నందిని రెడ్డి ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏదీ కన్ఫర్మ్ చేయలేదు. ఒక కథను విజయ్ దేవరకొండతో ఓకే చేయించుకుని వైజయంతి బ్యానర్ లో తీయాలని ప్లానింగ్ జరిగినట్టుగా ఇంతకు ముందు న్యూస్ వచ్చింది. అంతకు మించి అడుగు ముందుకు పడలేదని ఇన్ సైడ్ టాక్. మరోవైపు సమంతానే కీలక పాత్రలో మరో లేడీ ఓరియెంటెడ్ కొరియన్ రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నట్టుగా ఇంకో న్యూస్ ఉంది. ఇదీ డిస్కషన్ స్టేజిలోనే ఉందట.

మొత్తానికి ఈ లేడీ డైరెక్టర్ ఏ సంస్థలో ఎవరితో సినిమా చేయబోతున్నారు అనేది సస్పెన్స్ గానే నిలుస్తోంది. ఓ బేబీ లాంటి హిట్ మూవీ తర్వాత ఇంకా ఫైనల్ కాకపోవడం వింతే. అయితే కథా చర్చలు జరుగుతున్నాయని ఎవరితో ఓకే అవుతుందో వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొనడం వల్ల నందిని రెడ్డి వైపు నుంచి సైలెన్స్ ఉందని త్వరలోనే క్లారిటీ రావొచ్చని తన సన్నహితుల నుంచి వినిపిస్తున్న మాట. టాలీవుడ్ లో స్థిరంగా ఉంటూ కెరీర్ నిర్మించుకున్న ఒకే ఒక్క లేడీ డైరెక్టర్ గా పేరున్న నందిని రెడ్డి నుంచి వీలైనంత త్వరగా గుడ్ న్యూస్ వస్తే తన ఫ్యాన్స్ కు హ్యాపీ.