Begin typing your search above and press return to search.

హాటీ‌ క‌‌విత‌లు అల్లినా క‌ల‌లు క‌ల్ల‌లే

By:  Tupaki Desk   |   26 July 2020 7:30 AM GMT
హాటీ‌ క‌‌విత‌లు అల్లినా క‌ల‌లు క‌ల్ల‌లే
X
రోజ్ ఈజ్ రెడ్.. ఓసియ‌న్స్ ఆర్ బ్లూ.. దిస్ ఈజ్ మి ఇన్ క్వారంటైన్.. హౌ ఎబౌట్ యు? ఇదీ కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ క‌వితాత్మ‌క హృద‌యం. గులాబీ ఎరుపు.. స‌ముద్రం బులుగు.. ఇదిగో నేను స్వీయ నిర్బంధంలో.. మ‌రి మీ సంగ‌తేంటి? ఇదీ ప్ర‌గ్య‌ ప్ర‌శ్న‌. త‌న‌ ఉద్ధేశ‌మేదైనా కానీ క్వారంటైన్ టైమ్ ని పిచ్చ పిచ్చ గా ఎంజాయ్ చేయడ‌మెలానో ఈ ఫోటో చెప్ప‌క‌నే చెప్పింది. ప్ర‌గ్య గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్న ఫోటోల్ని చూస్తుంటే ఈ అమ్మ‌డు మ‌హ‌మ్మారీ కి బ‌య‌ప‌డ‌క బీచ్ లొకేష‌న్ల‌ను బాగానే ఎంజాయ్ చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

బీచ్ లో ప్ర‌తి చిలౌట్ మూవ్ మెంట్ ని ఇటీవ‌లి కాలంలో ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇంత‌కుముందు రెడ్ హాట్ బికినీ లుక్ ని షేర్ చేసిన ప్ర‌గ్య జైశ్వాల్ తాజాగా వైట్ టాప్ డెనిమ్స్ లో టాప్ లేపేస్తున్న ఫోటోని షేర్ చేసింది. ప్ర‌గ్య ప‌బ్లిసిటీ స్టంట్ యువ‌త‌రంలో వైర‌ల్ గానే దూసుకెళుతోంది. లేటెస్ట్ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది.

అయితే ప్ర‌గ్య ఎంత క‌విత‌లు అల్లినా.. ఎంతగా ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతున్నా టాలీవుడ్ లో ఛాన్సులిచ్చేవాళ్లే క‌రువ‌య్యారు. క‌నీసం వెబ్ సిరీస్ ఆఫ‌ర్లు అయినా ఈ అమ్మ‌డిని వరిస్తున్న‌ది లేదు. జ‌య జాన‌కి నాయ‌క త‌ర్వాత ప్ర‌గ్యకు ఆఫ‌ర్లు లేవు. అడ‌పాద‌డ‌పా అవార్డు వేడుక‌ల్లో డ్యాన్సింగ్ డాళ్ గా మాత్ర‌మే క‌నిపించింది. కెరీర్ ప‌రంగా లోపం ఎక్క‌డుందో త‌నే క‌నిపెడుతుందేమో చూడాలి. ప‌దేళ్ల క్రితం చిరుత చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌యం అయిన నేహాశ‌ర్మ ఇటీవ‌ల ప‌బ్లిసిటీ స్టంట్ క‌లిసొచ్చి బిజీ అయ్యింది. అంత‌గా కెరీర్ ప‌రంగా క్లారిటీ లేని అదా శ‌ర్మ‌కు కూడా ప‌బ్లిసిటీ క‌లిసొచ్చి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మ‌రి ప్ర‌గ్య‌కే ఎందుకిలా?