Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డి సినిమాకి ఓటీటీలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో..!
By: Tupaki Desk | 2 April 2021 10:12 PM ISTప్రస్తుతం ఒక సినిమా థియేట్రికల్ రన్ ఒక వారం లేదా రెండు వారాలు. ఆ సినిమా మరీ బాగుంటే థర్డ్ వీక్ లోకి ఎంటర్ అవుతుంది. పెద్ద సినిమాలు మరియు మీడియం రేంజ్ సినిమాలకు అయితే ఫస్ట్ డేనే రిజల్ట్ ఎంటనేది తేలిపోతుంది. కానీ కొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ లో విడుదలై, జనాలు చూసి, బావుంది అని డిసైడ్ అయ్యే లోపే తీసేస్తుంటారు. ఇక్కడ డిస్ట్రీబ్యూషన్ వ్యవస్థ.. ట్రేడ్ తదితర అంశాల కారణంగా అలాంటి సినిమాలు కనుమరుగు అవుతుంటాయని చెప్పవచ్చు. గతంలో థియేటర్స్ లో బాగుందనే లోపు తీసేసిన చాలా సినిమాలు.. బుల్లితెర మీద యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఉదాహరణకు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన 'బ్లఫ్ మాస్టర్' అనే చిత్రం థియేటర్స్ లో కంటే య్యూట్యూబ్ లోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సైతం మెచ్చుకున్న సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు ఇలాంటివి జరుగుతుంటాయి.
అయితే ఇప్పుడు 'క్లైమాక్స్' అనే సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. 'డ్రీమ్' సినిమాతో పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డ్స్ అందుకున్న కె.భవాని శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నటకిరీటి రాజేందర్ ప్రసాద్ - శ్రీరెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైనప్పటికీ డిస్ట్రీబ్యూషన్ వ్యవస్థలో ఉన్న ఇబ్బందుల కారణంగా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులకి చేరలేదు. కానీ ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారందరూ గుడ్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే సరైన థియేటర్స్ దొరక్క జనాలకి చేరువ కాలేకపోయిన 'క్లైమాక్స్' సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఈ సినిమాకి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో చూడాలి.