Begin typing your search above and press return to search.

నిఖిల్ ఏంటి బాలీవుడ్? మీరే కాదు నేనూ అనుకున్నా

By:  Tupaki Desk   |   27 Aug 2022 4:06 AM GMT
నిఖిల్ ఏంటి బాలీవుడ్? మీరే కాదు నేనూ అనుకున్నా
X
కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ తో మాంచి ఊపు మీద ఉన్నాడు యువనటుడు నిఖిల్. భారీ బజ్ లేకుండా సైలెంట్ గా విడుదలైన ఈ మూవీ సునామీ కలెక్షన్ల తో దూసుకెళ్లిన వైనం తెలిసిందే. కేవలం మౌత్ టాక్ తో ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ మూవీ విడుదలైన మూడో వారం దాటేస్తున్నా.. ఇంకా థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతూ ఉండటమే కాదు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1200 స్క్రీన్లలో ప్రదర్శితమవుతూ ఉండటం విశేషం. ఇదే విషయాన్ని ఈ మూవీ హీరో నిఖిల్ వెల్లడించారు.

రూ.100 కోట్ల క్లబ్ లో తన మూవీ చేరిన వైనంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన నిఖిల్.. సినిమా అంటే బాక్సాఫీసు నంబర్లు కావని.. అదో ఎమోషన్ గా అభివర్ణించాడు.ప్రేక్షకుల ప్రేమే రూ.100 కోట్లతో సమానమన్న అతడి నోటి నుంచి ఆసక్తికర అంశాలు వచ్చాయి. 'నిఖిల్ ఏంటి బాలీవుడ్ కు వెళ్లటం ఏంటి? అని మీరే కాదు నేనూ అనుకున్నా. కానీ సినిమా విడుదలయ్యాక పరిస్థితి మారింది. ఇది కార్తికేయ 2 విజయం కాదు తెలుగు సినిమా విజయం' గా అభివర్ణించారు
తాము సినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేదని..

ఆడియన్స్ మీఅంతట మీరే ఈ సినిమాను తీసుకెళ్లారన్నారు నిఖిల్. "బాహుబలి.. పుష్ప.. ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా సత్తా ఏమిటన్నది ప్రపంచానికి చూపాయి. కార్తికేయ 2 హిందీలో డబ్ అయి.. ఉత్తరాదిన విడుదల అవుతుందంటే భయమేసింది'' అని పేర్కొన్నారు. మొత్తంగా కార్తికేయ 2 సంచలన విజయంతో మాంచి హుషారు మీద ఉన్న నిఖిల్ మాటలు ఇప్పుడు ఆసక్తకిరంగా మారాయి.