Begin typing your search above and press return to search.

నిఖిల్ బ‌ర్త్ డేకి స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఏమై ఉంటుంది?

By:  Tupaki Desk   |   26 May 2021 6:49 AM GMT
నిఖిల్ బ‌ర్త్ డేకి స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఏమై ఉంటుంది?
X
సుకుమార్ రైటింగ్స్ నుంచి వ‌స్తున్న ప్రేమ‌కథా చిత్రం `18 పేజెస్`. నిఖిల్ హీరో. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి క‌థ‌- స్క్రీర్‌ ప్లే అందించ‌డంతో పాటు నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్ ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోపిసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు.

ఇంత‌కుముందు రిలీజైన ప్రీలుక్ పోస్ట‌ర్ల‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది. సుకుమార్ రైటింగ్స్ నుంచి యువ‌త‌రం మెచ్చే మ‌రో అరుదైన ప్రేమ‌క‌థా చిత్రాన్ని చూసే వీలుంద‌ని అర్థ‌మైంది. తాజా స‌మాచారం మేర‌కు జూన్ 1న నిఖిల్ బ‌ర్త్ డే కానుక‌గా ఫ‌స్ట్ లుక్ ని లాంచ్ చేసేందుకు జీఏ2 సంస్థ సిద్ధ‌మ‌వుతోంది. ``18 పేజెస్ నుంచి మ‌రో చాప్ట‌ర్ ని రివీల్ చేసే టైమ్ వ‌చ్చేసింది`` అని స‌ద‌రు సంస్థ‌ వెల్ల‌డించింది. నిఖిల్ కి అడ్వాన్స్ డ్ గానే టీమ్ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపింది.

``మొబైల్ లో ఉంటూ ఆన్ లైన్ లో గ‌డిపే హీరో.. ఈరోజుల్లోనూ ఇంకా లేఖ‌లు రాస్తూ పేప‌ర్ ని ప్రేమించే అమ్మాయికి మ‌ధ్య ఏం జ‌రిగింది?`` అన్నది ఫ‌స్ట్ లుక్ లో ఆవిష్క‌రించ‌నున్నారు. నేడు రిలీజ్ చేసిన‌ ఈ ప్రీలుక్ లోనూ ఇదే థీమ్ ని ఆవిష్క‌రించారు. ఎడ‌మ‌వైపు మొబైల్ లో ఉండే అబ్బాయి చేతిని.. కుడివైపు పేప‌ర్ పై లేఖ రాస్తున్న అమ్మాయి చేతిని సింబాలిక్ గా చూపించేసిన తీరు ఆస‌క్తిక‌రం. ఫ‌స్ట్ లుక్ కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఉంటుందని.. సినిమా క‌థ‌ను చెబుతుందని టీమ్ వెల్లడించింది.