Begin typing your search above and press return to search.
'సంక్రాంతి విడుదల' అని ప్రకటించిన సినిమాల పరిస్థితి ఏంటో..?
By: Tupaki Desk | 17 Nov 2020 3:00 PM ISTసంక్రాంతి పండుగ అంటే 'సినిమా పండుగ'. ప్రతి ఏడాది చాలా సినిమాలు సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ లో బాక్సాఫీస్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుందని అందరూ అదే స్లాట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. రాబోయే సంక్రాంతికి కూడా అనేక సినిమాలు లైన్లో ఉన్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన క్రేజీ మూవీస్ అన్నీ ఇప్పుడు సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుంటున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. నితిన్ 'రంగ్ దే'.. దగ్గుబాటి రానా 'అరణ్య'.. రామ్ పోతినేని 'రెడ్' ఫెస్టివల్ సీజన్ లో రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు 'కేజీఎఫ్ 2' 'మాస్టర్' వంటి చిత్రాలు కూడా సంక్రాంతి రేస్ లో ఉండే అవకాశం ఉంది. అలానే పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'.. శర్వానంద్ 'శ్రీకారం' ఇలా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలన్నీ పండగ రిలీజ్ నే టార్గెట్ చేస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లాలనుకుంటున్న ఈ సినిమాలను చూడటానికి జనాలు వస్తారో రారో అనే అనుమానాలు మాత్రం వీడడం లేదు.
కోవిడ్ నేపథ్యంలో మూతబడిపోయిన సినిమా థియేటర్స్ దీపావళి నుంచి అన్నీ చోట్లా ఓపెన్ చేస్తారని అందరూ భావించారు. ఇప్పుడు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో రన్ అవుతున్న థియేటర్స్ డిసెంబర్ లో 100 శాతం ఆకుపెన్సీతో తెరిస్తే జనాలు ఓ నెల రోజులు పడుతుందని.. అందుకే సంక్రాంతి పండగ రిలీజ్ పర్ ఫెక్ట్ అనే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారు. అయితే సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఓటీటీల కారణంగా నూటికి 90 శాతం క్లాస్ ఆడియెన్స్ థియేటర్స్ కి వచ్చేందుకు ఇష్ట పడటం లేదని తెలుస్తోంది. ఒకవేళ థియేటర్స్ కి రావాలని అనుకున్నా ఏదైనా విజువల్ ఫీస్ట్ ఉన్న సినిమాలు చూడటానికి మాత్రమే రావడం తప్పిస్తే.. మామూలు సినిమాలు చూడటానికి థియేటర్ కి క్లాస్ ఆడియెన్స్ రావడం దాదాపు కష్టమే అని తెలుస్తోంది. ఇక క్లాస్ బి ఆడియెన్స్ ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిని కూడా పైరసీలో చూడటానికి అలవాటు పడిపోయారు. క్లాస్ సి ఆడియెన్స్ సినిమాలు చూసే పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఇంత ప్రతికూలత మధ్య సంక్రాంతి సీజన్ లో ఆడియెన్స్ థియేటర్ కి వస్తారో లేదో అనేది ప్రశార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ బాట పడుతున్నాయనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీపావళి టైమ్ లో అయినా థియేటర్స్ తెరుస్తారనే ఆశ అందరిలో ఆవిరి అయిపోవడంతో డిసెంబర్ లాస్ట్ వీక్ మరియు జనవరి నెలలో విడుదలయ్యే సినిమాల్ని ఓటీటీలకు ఫ్యాన్సీ రేట్లకి డైరెక్ట్ రిలీజ్ పద్ధితిలో ముట్టచెప్పడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.