Begin typing your search above and press return to search.

ధ‌నుష్ సినిమా ప‌రిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   19 Aug 2022 4:04 AM GMT
ధ‌నుష్ సినిమా ప‌రిస్థితి ఏంటీ?
X
ఈ మ‌ధ్య టైమ్ దొరికింది క‌దా అని సినిమాల‌ని హ‌డావిడిగా రెడీ చేసి థియేట‌ర్ల‌లోకి వ‌దిలేస్తున్నారు. ఎలాంటి ప‌బ్లిసిటీ కూడా చేయ‌కుండా డైరెక్ట్ గా థియేట‌ర్ల‌లోకి దింపేస్తున్నారు. దీంతో సినిమా వ‌చ్చిన విష‌యం కూడా ఎవ‌రికీ తెలియ‌డం లేదు. లేటెస్ట్ గా త‌మిళ హీరో ధ‌నుష్ న‌టించిన 'తిరు' తెలుగులో ఇదే త‌ర‌హాలో విడుద‌లైంది. త‌మిళంలో 'తిరుచిత్రాంబ‌ళం'. మిత్ర‌న్ ఆర్‌. జ‌వ‌హ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ నిర్మించారు.

ఇదే మూవీని తెలుగులో 'తిరు' పేరుతో హ‌డావిడిగా ఆగ‌స్టు 18న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన సినిమా కావ‌డంతో త‌మిళంలో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. కానీ తెలుగులో మాత్రం ఈ మూవీకి పెద్ద‌గా థీయేట‌ర్లు ల‌భించిలేదు. హ‌డావిడిగా రిలీజ్ చేయ‌డం.. తెలుగు సినిమాలు స‌క్సెస్ ఫుల్ గా థియేట‌ర్ల‌లో ర‌న్న‌వుతూ వుండ‌టంతో ధ‌నుష్ 'తిరు'కు థియేట‌ర్ల‌కు పెద్ద‌గా ద‌క్క‌లేదు.

ఈ మ‌ధ్య ధ‌నుష్ సినిమాలు తెలుగులో అధికంగా డ‌బ్ అవుతున్న కార‌ణంగా అదే పంథాలో 'తిరు'ని కూడా విడుద‌ల చేశారు. స‌డ‌న్ గా విడుద‌ల చేయ‌డంతో సినిమాకు ఎక్క‌డా బ‌జ్ క‌నిపించ‌లేదు. ఆ ప్ర‌భావం ఓపెనింగ్స్ పై ప‌డింది. ఇక ఈ మూవీని బి,సి సెంట‌ర్ల‌లో అయితే ప‌ట్టించుకున్న వాళ్లేలేరు. సిటీల్లో కొంత వ‌ర‌కు ఓకే. ఇక సినిమా కంటెంట్ విష‌యానికి వ‌స్తే 'తిరు' డిఫ‌రెంట్ స్టోరీ ఏమీ కాదు. రొటీన్ స్టోరీనే. ప‌క్కాగా చెప్పాలంటే 'తిరు' ఓ సాదాసీదా క‌థ‌.

తిరు ఏకాంబ‌రం అలియాస్ పండు (ధ‌నుష్‌) ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుడు. చ‌దువు అట‌కెక్క‌డంతో తండ్రి (ప్ర‌కాష్‌రాజ్‌) తిరుని ప్ర‌తీ విష‌యంలోనూ తిడుతూ వుంటాడు. త‌న జీవితంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న కార‌ణంగా తండ్రిపై ద్వేషంతో మాట్లాడ‌ట‌మే మానేస్తాడు.

కానీ తాత (భార‌తీరాజా) మాత్రం మంచి ఫ్రెండ్ లా వ్య‌వ‌హ‌రిస్తూ 'తిరు'కు అండ‌గా వుంటుంటాడు. చ‌దువు మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డం..ప‌ని పాటా లేక‌పోవ‌డం తిరు ఫుడ్ డెలివ‌రీ బాయ్ గా ప‌ని చేస్తూ వుంటాడు. త‌న‌కు చిన్న‌నాటి స్నేహితురాలు శోభ‌న (నిత్యామీన‌న్‌). తిరు వుండే అపార్ట్ మెంట్ కిందే శోభ‌న ఫ్యామిలీ వుంటుంది. దీంతో ప్ర‌తీ విష‌యాన్ని త‌న‌దో షేర్ చేసుకుంటూ వుంటాడు తిరు.

ఇంత క్లోజ్ గా వున్నా శోభ‌న‌ని ప్రేమించ‌ని తిరు త‌న క్లాస్ మేట్ అనూష (రాశిఖ‌న్నా).. మ‌రో యువ‌తి రంజ‌ని (ప్రియా భ‌వానీ శంక‌ర్‌) ల‌ని ప్రేమిస్తాడు. ఈ ప్రేమాయ‌ణాల‌కు శోభ‌న స‌ల‌హాల‌నే తీసుకుంటాడు తిరు. అయితే ఈ ముగ్గురిలో తిరు ప్రేమ‌ని అర్థం చేసుకుంది ఎవ‌రు? చ‌ఇవ‌రికి అత‌ని భార్య‌గా మారింది ఎవ‌రు? అస‌లు తండ్రితో మాట్లాడ‌కుండా వుండ‌టానికి గ‌ల కార‌ణం ఏంటీ? .. తన‌లోని భ‌యాన్ని తిరు ఎలా అధిగ‌మించాడు అన్న‌ది అస‌లు క‌థ.

ఫ‌స్ట్ హాఫ్ ఫ‌ర‌వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ తేలిపోవ‌డంతో తిరు జ‌స్ట్ యావ‌రేజ్ మూవీగా నిలిచింది. కంటెంట్ చాలా వీక్ గా వున్నా ధ‌నుష్‌, భార‌తీరాజా, నిత్యామీన‌న్ త‌మ న‌ట‌న‌తో కొంత వ‌ర‌కు లాగుకొచ్చారు. ఏ ఆప్ష‌న్ లేక‌లేదంటేనే ప్రేక్ష‌కులు ఈ మూవీకి వ‌చ్చే అవ‌కాశం వుంది. అయితే బింబిసార‌, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు ధ‌నుష్ కు ఆ ఛాన్స్ ఇవ్వ‌డం క‌ష్ట‌మే.