Begin typing your search above and press return to search.

మన వెంకీ మామ పరువు పోతుందా ఏంటి పాపం!

By:  Tupaki Desk   |   7 Sep 2022 9:37 AM GMT
మన వెంకీ మామ పరువు పోతుందా ఏంటి పాపం!
X
బాలీవుడ్‌ లో బ్రహ్మాస్త్ర సినిమా తో నాగార్జున చాలా సంవత్సరాల తర్వాత నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితంపై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. నాగార్జున మాత్రమే కాదు వెంకటేష్‌ కూడా బాలీవుడ్‌ లో తాజాగా నటిస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాతో వెంకటేష్ బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్తున్న విషయం తెల్సిందే.

బాలీవుడ్‌ లో వెంకటేష్ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా విడుదల అయిన సల్మాన్ ఖాన్ లుక్ మరియు ఆయన లుక్‌ టీజర్ చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకుల ఉత్సాహం నీరుగారిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. బాబోయ్ సల్లూ భాయ్ లుక్ చూస్తూ ఉంటే సినిమా కి దెబ్బ పడటం ఖాయం అనిపిస్తుంది.. పాపం మన వెంకీ మామ ఇలాంటి సినిమా తో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాడా అంటూ ట్రోల్స్ నడుస్తున్నాయి.

సల్మాన్‌ ఖాన్‌ తాజా వీడియోలోని లుక్ పై రకరకాలుగా ట్రోల్స్ వస్తున్నాయి. విగ్గు బాగుందని కొందరు అంటే... నెత్తిన గడ్డి పడ్డట్లుగా ఉందని మరి కొందరు అంటున్నారు. ఇది మరీ ఓవర్‌ స్టైల్‌ అంటూ ఇంకొందరు రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ ను విమర్శిస్తున్నారు. దాంతో సినిమాపై ఇప్పటి నుండే నెగటివ్‌ ఫీలింగ్ కలుగుతుందని ప్రచారం మొదలయ్యింది. ఈ సినిమాతో మన వెంకీ పరువు పోయేనా అంటూ ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.

ఈ సినిమాకు మొదట కభీ ఈద్ కభీ దీవాలి అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల టైటిల్‌ ను మార్చారు. తాజాగా కిసీకో భాయ్ కిసీకో జాన్ అంటూ టైటిల్ ను ఖరారు చేశారు. భాయ్ జాన్ అంటూ ఈ సినిమాని సల్మాన్ ఖాన్ అభిమానులు పిలుచుకుంటున్నారు.

ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హగ్డే కి అన్న పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడు. వెంకటేష్ ఉండటం వల్ల తెలుగు లో మంచి మార్కెట్‌ ఈ సినిమా దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కానీ సల్మాన్‌ ఖాన్ లుక్ చూస్తూ ఉంటే వెంకీ మామ ఉన్నా కూడా ఇక్కడ బిజినెస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని మీడియా లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.