Begin typing your search above and press return to search.

శకుంత‌ల‌లో శృంగార కోణం ఇలా?

By:  Tupaki Desk   |   13 April 2023 9:39 PM IST
శకుంత‌ల‌లో శృంగార కోణం ఇలా?
X
స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో 'శాకుంతంలం' తెరెక్కిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. కాళిదాసు ర‌చించిన 'అభిజ్ఞాన శాకుంత‌లం' ర‌చ‌న ఆధారంగా శాకుంత‌లంని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. గుణ‌శేఖ‌ర్ మార్క్ చిత్రంగా హైలైట్ అవుతుంద‌ని అంచ‌నాలున్నాయి. సినిమాలో స‌మంత‌ని మ‌రింత అందంగా ఆవిష్క‌రించిన‌ట్లు క‌నిపిస్తుంది. ఓ ఇంట‌ర్వ్యూలో గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. ' శకుంత‌ల క‌థ అన‌గానే ఎక్కువ‌గా ఆమెలోని శృంగార కోణమే అంద‌రికీ గుర్తొస్తుంది.

ఆమె పాత్ర‌ని బేస్ చేసుకుని ఎక్కువ‌గా శృంగార కొణ్నాన్నే మేక‌ర్స్ హైలైట్ చేస్తుంటారు. అయితే నేను మాత్రం అదే పాత్ర‌లో మ‌రో కోణాన్ని ప్ర‌ధానంగా తీసుకున్నా. శాకుంత‌లంలో ఆత్మాభిమానం మెండుగా ఉన్న ఓ సౌంద‌ర్యరాశిని ప్ర‌ధానంగా హైలైట్ చేస్తున్నాం. మహా భార‌తంలోని ఆదిప‌ర్వంలోని శ‌కుంత‌ల క‌థ‌కి త‌న‌దైన శైలిలో కొన్ని పాత్ర‌ల్ని జోడించి అభిజ్ఞాన శాకుంత‌లం రాశారు కాళిదాసు.

ఆయ‌న కోణంలో గొప్ప‌గా ఉంటుందీ కావ్యం. ఇప్ప‌టి యువ‌త బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని న‌మ్మా. శృంగార కోణానికి రెండ‌వ ప్రాధాన్య‌త ఇచ్చి ఆత్మాభిమానాన్ని ప్ర‌ధానంగా హైలైట్ చేస్తున్న‌ట్లు గుణ‌శేఖ‌ర్ తెలిపారు. మ‌రిన్ని వివ‌రాలు తెలుపుతూ.

'ఆ రోజుల్లోనే పెళ్లికాకుండానే బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది శ‌కుంత‌ల‌. వ్య‌క్తుల వ‌ల్లే కాదు.. స‌మాజం నుంచి కూడా తీవ్ర వ్య‌తిరేక‌త‌ను చూసింది. అలాంటి ప‌రిస్థితుల్లోనూ విలువ‌లు కోసం..ఆత్మాభిమానం కోసం నిల‌బ‌డి త‌ను అనుకున్న‌ది సాధించే పురాణ స్త్రీ శ‌కుంత‌ల. నేటి త‌రానికి ఆమె స్పూర్తి దాయ‌కం. ఇప్పుడు కూడా మ‌హిళ‌లు ప‌రిస్థితుల‌కు ఎదురొడ్డి నిల‌బ‌డుతున్నారు.

అందుకే ఈ క‌థ‌ని నెటి త‌రం క‌నెక్ట్ అవుతుంద‌ని.. ప్ర‌స్తుత‌ ప‌రిస్థితులు ప్ర‌తిబింబిస్తుంద‌ని న‌మ్మి సినిమా చేస్తున్నా. శ‌కుంత‌ల ప్ర‌పంచం ప్ర‌త్యేక‌మైన‌ది. ఆమె అడ‌విలో పుట్టి పెరిగారు. ఆమె స్నేహితులంతా జంతువులే. ఈ నేప‌థ్యంలో స‌న్నివేశాల స‌హ‌జ‌త్వం కోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఆ నాటి కాలం జంతువులు ఇప్పుడు లేవు. వాటిని క్రియేట్ చేయ‌డం కోసం సాంకేతికంగా చాలా వ‌ర్క్ చేసాం. ఆర‌కంగా సినిమా విజువ‌ల్ గానూ సినిమా హైలైట్ గా ఉంటుందన్నారు.