Begin typing your search above and press return to search.
విక్రమ్ సినిమాలో చైతూ రోల్ అదేనా..?
By: Tupaki Desk | 29 Dec 2020 3:00 PM ISTఅక్కినేని కుటుంబంతో ‘మనం’ చిత్రం రూపొందించారు దర్శకుడు విక్రమ్ కె కుమార్. మూడు తరాలను ఒకే ఫ్రేమ్ లో చూపించిన ఈ డైరెక్టర్.. అక్కినేని అభిమానులకు లైఫ్ టైం మెమరబుల్ మూవీని అందించాడు. ఈ చిత్రంతో అటు అక్కినేని ఫ్యామిలీ.. ఇటు వారి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
తన సినిమాలతో ఎప్పటికప్పుడు ఒక సరికొత్త ఫీలింగ్ ను ఇచ్చే ఈ దర్శకుడు.. మరోసారి అక్కినేని యువ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు. నాగ చైతన్య తో ‘థాంక్యూ’ అనే సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే.. ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ లో చైతు ఒక స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించనున్నాడని సమాచారం. అది కూడా ఒక హాకీ ప్లేయర్ రోల్ లో నటించబోతున్నాడట చైతూ. అయితే.. ఇప్పటికే తన లాస్ట్ చిత్రం ‘మజిలీ’లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కనిపించాడు చైతన్య. మరి, ఈ సినిమాలో కూడా అలాంటి రోల్ లోనే కనిపిస్తాడా? అనే చర్చ జరుగుతోంది.
ఇక, ఈ సినిమాలో కథ రీత్యా ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు. ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేశారు. మిగిలిన ఇద్దరు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.
కాగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవితో కలిసి నాగ చైతన్య నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయిందని టాక్. దీంతో అటు ‘థాంక్యూ’ చెప్పి కొత్త సినిమా షూటింగ్ లో జాన్ అవుతున్నాడట అక్కినేని అబ్బాయి.