Begin typing your search above and press return to search.

బ్రహ్మానందంకు అవకాశాలు రాకపోవడం వెనుక కారణమేంటి?

By:  Tupaki Desk   |   14 May 2020 11:30 AM IST
బ్రహ్మానందంకు అవకాశాలు రాకపోవడం వెనుక కారణమేంటి?
X
పోకిరి సినిమా.. మహేష్ బాబు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమా.. ఈ సినిమాలో బిచ్చగాళ్లు అడుక్కునే సీన్ ఫుల్ కామెడీ పండించింది. నిజానికి అంత కమర్సియల్ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అనేది దర్శకుడు పూరి కావాలని పెట్టిందట..ఆ ట్రాక్ లేకున్నా సినిమాకు వచ్చిన నష్టమేమీ లేదు. పైగా సినిమాలో ఆ ట్రాక్ కలిసిపోదు.. జనాలను నవ్వించడానికి కథలో ఇన్ వాల్వ్ చేశానని అప్పట్లో చెప్పాడు..

ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్త దర్శకులు దూసుకు వస్తున్నారు. కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు. కొత్తదనం లేనిదే ముందుకు పోవడం లేదు. ‘భరత్ అనే నేను’ మూవీలో అసలు కామెడీ ట్రాకే లేదు. సీరియస్ పొలిటికల్ డ్రామా.. అయినా హిట్ అయ్యింది. అదంతా కథలోని గొప్పదనమే.. అందులోనూ కామెడీ ట్రాక్ పెట్టొచ్చు . కానీ కథ దెబ్బతింటుందని కొరటాల శివ ఆ ప్రయత్నం చేయలేదు. అయినా బాక్సాఫీస్ వద్ద ‘భరత్ అనే నేను’ సినిమా హిట్ కొట్టింది. కాసులు కురిపించింది.

కొరటాలే కాదు.. కొత్తగా ఏ సినిమా వచ్చినా దర్శకులు కథకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేటి కాలానికి అనుగుణంగా కథను తీర్చిదిద్దుతున్నారు. అందుకే బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్లకు అవకాశాలు తగ్గిపోయాయి.. జబర్ధస్త్ తో పాపులర్ అవుతున్న కుర్ర కమెడియన్లకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ కుర్రాళ్లు నేటి నేటివిటీకి సరిపోవడంతో బ్రహ్మీ పాత్రలను వీరే చేజిక్కించుకుంటున్నారు. కొత్తదనం కోసం కూడా దర్శకులు ఈ కొత్త కమెడియన్స్ కే అవకాశాలు ఇస్తున్నారు..

ఒకప్పుడు బ్రహ్మానందం లేనిదే సినిమా లేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బ్రహ్మానందం లేకుండా సినిమాలు చాలా వస్తున్నాయి.. హిట్స్ కొడుతున్నాయి. బ్రహ్మానందంకు ఉన్న ఏజ్ ఫ్యాక్టర్ (వయసు పైబడడం) ఆయనకు మైనస్ గా మారిందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మానందంకు సరిపోయే పాత్రలను నేటి నవతరం దర్శకులు సృష్టించడం లేదు. పైగా కొత్తదనం కోసం వాస్తవ పరిస్థితులతో కథలను రాస్తుండడంతో బ్రహ్మీ సహా సీనియర్ కమెడియన్లకు, నటులకు అవకాశాలు రావడం లేదు.. అందుకే ఇప్పుడు తెలుగు నాట దూసుకొస్తున్న ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్, జబర్ధస్త్ కమెడియన్ల వరుస అవకాశాలు దక్కించుకుంటుండగా.. బ్రహ్మానందం లాంటి సీనియర్లు మాత్రం పాత్రల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది..

నిజానికి బ్రహ్మానందం మేనియా ఫుల్ గా ఉన్నప్పుడు సినిమా షూటింగ్ లలో ఒక్కో రోజుకు ఆయన 5 లక్షలవరకు తీసుకునేవాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది.. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ తగ్గించినా బ్రహ్మీకి పాత్రలు దక్కడం లేవంటే విధి వైపరీత్యమే... దీనికంతటికీ కొత్త కథల ప్రభావమే అని చెప్పవచ్చు..