Begin typing your search above and press return to search.

రేణు దేశాయ్ కి వ‌చ్చిన క‌ష్టం ఏమిటో..?

By:  Tupaki Desk   |   22 March 2021 5:15 PM IST
రేణు దేశాయ్ కి వ‌చ్చిన క‌ష్టం ఏమిటో..?
X
సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం త‌న భావాల్ని ఎలాంటి బెరుకు లేకుండా బ‌హిరంగంగానే వ్య‌క్తం చేస్తూ చ‌ర్చ‌ల్లోకొస్తున్నారు రేణు దేశాయ్. ఇటీవ‌లే చ‌ర్చిలు మ‌సీదుల‌ను ప్ర‌యివేటు వ్య‌క్తులు నిర్వ‌హిస్తుంటే దేవాల‌యాల‌ను మాత్రం ప్ర‌భుత్వాలు న‌డిపించాల్సిన అవ‌స‌రం ఏమిటో? ఇదేనా ప్ర‌జాస్వామ్యం? అంటూ నిల‌దీసారు. ఒక్క‌ లాజిక‌ల్ ప్ర‌శ్న‌తో వేడెక్కించారు. నిరంత‌రం సామాజిక జిజ్ఞాస‌తో ప్ర‌శ్న‌లు సంధిస్తూ రేణు ఇలా అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ అవుతున్నారు.

అలాగే జీవితంలో క‌ష్టం! అంటూ తాజాగా త‌న క‌ష్టం గురించి చెప్ప‌డంతో అది కాస్తా నెటిజ‌నుల్లో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ఓ యాడ్ షూట్ లో పాల్గొంటున్న రేణు రాత్రి పూట షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇది నాకు సౌక‌ర్యం కాదు. కానీ జీవితమంటేనే ఓ ప్రయోగం కదా? అని అన్నారు. నైట్ షూట్ అంటేనే రేయంతా ఉండాల్సిందే కదా?. అర్దరాత్రి దాటి రెండు గంటలు అవుతోంది! అని వెల్ల‌డించారు. న‌వ్వుతూ ఉన్న సెల్ఫీని షేర్ చేశారు.

రేణు ఇటీవ‌ల ఆద్య అనే పాన్ ఇండియా వెబ్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇది కార్పొరెట్ కంపెనీల మోసాల నేప‌థ్యంలో థ్రిల్లింగ్ సిరీస్ అని తెలిసింది. ఇందులో రేణు కంపెనీ సీఈవోగా క‌నిపించ‌నున్నారు. నందినీ రాయ్- ధన్సిక ఈ సిరీస్ లో ఇత‌ర‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.