Begin typing your search above and press return to search.

వంశీ పైడిపల్లి.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

By:  Tupaki Desk   |   27 Feb 2020 8:00 AM GMT
వంశీ పైడిపల్లి.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?
X
వంశీ పైడిపల్లి ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య గ్యాప్ ఎక్కువగా తీసుకుంటారు. వంశీ మొదటి సినిమా 'ఎవడు' 2007 లో రిలీజ్ అయింది. ఈ పదమూడేళ్ళలో వంశీ చేసింది ఐదు సినిమాలు మాత్రమే. 'మహర్షి' చేసిన తర్వాత వంశీ మరోసారి మహేష్ బాబుతోనే పనిచేయాల్సి ఉంది. మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' పూర్తి చేసుకునే లోపు వంశీ నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తారని అనుకున్నారు. రెండు మూడు రోజుల క్రితం వరకూ #మహేష్27 వంశీతోనే అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడం అందరికీ షాక్ ఇచ్చింది.

ఇప్పుడు వంశీ తన సినిమాను ఎవరితో చేస్తాడనేది ఆసక్తి కరంగా మారింది. మహేష్ సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత వంశీకి రామ్ చరణ్ అవకాశం ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది జస్ట్ రూమర్ మాత్రమేనని 'RRR' పూర్తయ్యే వరకూ చరణ్ కొత్త సినిమాలకు సైన్ చెయ్యరని మెగా కాంపౌండ్ సన్నిహితులు చెప్తున్నారు. మరి వంశీ పైడిపల్లి దారెటు? వంశీ మొదటి నుంచి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. తన నెక్స్ట్ సినిమాను కూడా స్టార్ హీరోతోనే చెయ్యాలి అంటే మాత్రం చాలాకాలం వేచి చూడక తప్పేలా లేదు.

దాదాపు అందరూ స్టార్ హీరోలు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అంతే కాదు చాలామంది స్టార్లకు నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా ఫిక్స్ అయ్యాయి. దీంతో వారి డేట్స్ కోసం వంశీ వెయిట్ చెయ్యాల్సిందే. ఇదిలా ఉంటే వంశీ సినిమాలు మంచి పేరు తెచ్చుకుంటాయి కానీ కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలుస్తాయని ఒక టాక్ ఉంది. సినిమా తెరకెక్కించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాడు కాబట్టి బడ్జెట్ పెరిగిపోతుంది. మరోవైపు సినిమాలో భారీతనం కోసం ప్రయత్నం చేస్తాడని అది కూడా బడ్జెట్ పెరగడానికి మరో కారణం అవుతుందని అంటున్నారు. ఈ కారణాల వల్లే సినిమా హిట్ అనిపించుకున్నా నిర్మాతకు లాభాలు మాత్రం ఉండవనే టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వంశీకి నెక్స్ట్ సినిమా వెంటనే సెట్ కావడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.