Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఏంటనేది.. ఇంకా తేలలేదా..??

By:  Tupaki Desk   |   5 Jun 2021 10:30 AM GMT
ఆ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఏంటనేది.. ఇంకా తేలలేదా..??
X
తెలుగు ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో నూతన దర్శకుడుగా పరిచయమయ్యాడు బుచ్చిబాబు సాన. డెబ్యూ మూవీనే మంచి విజయం సాధించడంతో ఈ డైరెక్టర్ పై ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు కూడా నమ్మకం ఏర్పడింది. నిజానికి మొదటి సినిమా కోసం ఏడాది పాటు వెయిట్ చేసారు. ఎలాగోలా టైంతో పాటు 100% థియేటర్స్ అక్యూపెన్సీ లభించడంతో సినిమా విడుదలై మాంచి వసూళ్లు కూడా రాబట్టింది. అప్పటినుండి బుచ్చిబాబు టాలీవుడ్ వార్తల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా బుచ్చిబాబు నుండి న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి డైరెక్టర్ బుచ్చిబాబు తదుపరి సినిమా ఏంటి? అనే ప్రశ్నలు అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకులలో తలెత్తుతున్నాయి. మరి వాటికీ సమాధానం బుచ్చిబాబు ఆల్రెడీ ఇచ్చేసాడని కొన్ని కథనాలు తెలుపుతుంటే.. సోషల్ మీడియాలో బుచ్చిబాబు ఉప్పెన సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పేసాడని మరికొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మరి బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా.. బుచ్చిబాబు పలు ఇంటర్వ్యూలలో ఓ స్టార్ హీరో గురించి పదేపదే ప్రస్తావించాడు. ఆ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే నాన్నకు ప్రేమతో మూవీ టైంలో బుచ్చిబాబు ఎన్టీఆర్ కి ఓ స్టోరీ లైన్ వినిపించడం జరిగిందని చెప్పాడు.

ఆ లైన్ కూడా ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని చెప్పినట్లు తెలిపాడు. ఇంకా ఆ కథ తన దగ్గర రెడీగా ఉందని బుచ్చిబాబు కొన్ని సందేహాలకు తెరదింపాడు. అలాగే ఉప్పెన రిలీజ్ అయ్యాక నా నెక్స్ట్ సినిమా ఓ బడా హీరోతోనే ఉంటుందని చెప్పినట్లు వార్తలొచ్చాయి. మరి ఈ లెక్కన బుచ్చిబాబు నెక్స్ట్ హీరో ఎన్టీఆర్ మాత్రమే అయ్యుంటాడని అంచనాలు వేస్తున్నాయి సినీవర్గాలు. చర్చల దశలో ఉన్న ఆ కథ అనుకున్న హీరో దగ్గరికే వెళ్తుందా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం అయితే బుచ్చిబాబు తో ఎన్టీఆర్ మూవీ మాత్రం ఉండదట. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కాకుండా కొరటాల శివ - ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్ లో పెట్టేసాడు. మరి ఆ సినిమాలు పూర్తి అవ్వడానికే రెండేళ్లు పడుతుంది. మరి అప్పటివరకు బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయలేడు కదా.. తాను కూడా వేరే హీరోతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడని టాక్ నడుస్తుంది. చూడాలి మరి బుచ్చిబాబు ఏం చేస్తాడో..!