Begin typing your search above and press return to search.

బన్నీ సుకుమార్ సినిమా ఏం జరుగుతుంది

By:  Tupaki Desk   |   5 Oct 2019 1:42 PM GMT
బన్నీ సుకుమార్ సినిమా ఏం జరుగుతుంది
X
ఇదిగో ఆరోజు పూజా... ఈ తేదిన ముహూర్తం... వచ్చే నెల నుండి షూటింగ్ మొదలు. ఇవి బన్నీ, సుకుమార్ సినిమా గురించి వారానికో సారి వినబడుతున్న వార్తలు. నిజానికి ఇందులో నిజం లేకపోలేదు. అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఓ, మూడు సార్లు లాంచ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మళ్ళీ వెనక్కి వెళ్లారు. బన్నీ ఫ్యాన్స్ కూడా సుకుమార్ సినిమా అప్డేట్స్ ను లైట్ తీసుకొని ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' సినిమా మీదే ఫోకస్ పెట్టారు. మరి అంతగా ఫ్యాన్స్ ను ఊరించారు.

అయితే నిజానికి ఈ సినిమా అనౌన్స్ మెంట్ అప్పటి నుండి ఎందుకో ముందుకు వెళ్ళడం లేదు. ఎక్కడ ఆగిందో అక్కడే ఉండిపోయింది. మొన్నీ మధ్య కథ సెట్ అవ్వలేదన్నారు. ఇక ఇప్పుడు కథ సెట్ అయింది కానీ నిర్మాతలు ప్రాజెక్ట్ ని వదిలేసుకున్నారనే టాక్ వినబడుతుంది. కథా చర్చల్లో నిర్మాతలకు , సుకుమార్ కి ఏదో తేడా వచ్చిందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ సినిమా విషయంలో హాట్ హాట్ డిస్కర్షన్స్ మాత్రం నడుస్తున్నాయి.

ఇవన్నిటికి చెక్ పెట్టాలంటే సుకుమార్ -బన్నీ సినిమాకు సంబంధించి ఏదో ఓ అప్డేట్ మాత్రం రావల్సిందే. అప్పటి వరకూ రోజుకో వార్త ఇలాగే చక్కర్లు కొడుతుంది. మరి సుక్కు -బన్నీ ఈ వార్తలను అసలు పట్టించుకుంటున్నారో లేదో.