Begin typing your search above and press return to search.

రేణు పోస్టు అర్థమేమిటి చెప్మా?

By:  Tupaki Desk   |   21 Oct 2022 4:42 AM GMT
రేణు పోస్టు అర్థమేమిటి చెప్మా?
X
తాను చేసుకున్న మూడు పెళ్లిళ్ల మీద జనసేన అధినేత కమ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. దానికి కొనసాగింపుగా తాను చేసుకున్న మూడు పెళ్లిళ్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని ఆయన ఓపెన్ గా వెల్లడించారు. ఇంతవరకు ఎప్పుడూ ఓపెన్ కాని రీతిలో..

తాను చేసుకున్న పెళ్లిళ్లు.. విడాకుల సందర్భంగా తాను ఇచ్చిన మొత్తాల గురించి ఆయన చెప్పేశారు. పవన్ ను టార్గెట్ చేయాలన్నంతనే మూడు పెళ్లిళ్లు.. ప్యాకేజీ స్టార్ అంటూ టార్గెట్ చేసే రాజకీయ ప్రత్యర్థులకు ఆయన ఘాటైన సమాధానం ఇచ్చారు. చెప్పు చూపించి.. తనను ప్యాకేజీ స్టార్ అంటూ మాట తూలే వైసీపీ నేతల చెంపలు పగలకొడతానని స్పష్టం చేశారు.

పవన్ చెప్పిన విడాకులకు సంబంధించి తన మొదటి భార్యకు రూ.5కోట్లు చెల్లించానని.. రెండో భార్యకు కొంత ఆస్తి ఇచ్చినట్లుగా చెప్పారు. 2013లో పవన్ అధికారికంగా విడాకులు పొందిన తర్వాత నుంచి ఆమె ఫూణెలో పిల్లలతో కలిసి ఉంటున్నారు. నిజానికి ఈ మూడు పెళ్లిళ్ల వ్యవహారం పవన్ పొలిటికల్ కెరీర్ ను ఇబ్బందికరంగా మారుస్తోంది. ఆయన ఎంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా మూడు పెళ్లిళ్లు.. మూడు పెళ్లిళ్లు అంటూ చేసే వ్యాఖ్యలు ఆయన్ను ఇరిటేట్ చేస్తున్నాయి. ఆ విషయాన్ని తన తాజా వ్యాఖ్యలతో చెప్పేశారని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. రేణు తాజాగా చేసిన పోస్టులో 'నీ వెర్షన్ కాదు.. నా వెర్షన్ కాదు. నిజం అనేది ఒకటి ఉంటుంది. సత్యం శాశ్వితంగా ఉంటుందనేది నేను లైఫ్ లో నేర్చుకున్న అంశం' అంటూ ఒక కొటేషన్ ను రీల్ రూపంలో పెట్టారు. దీని అర్థమేమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

విడాకుల అనంతరం ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎలాంటి భరణం తీసుకోలేదని చెప్పారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓపక్క రేణు తాను ఎలాంటి భరణం తీసుకోలేదని చెబుతుంటే.. పవన్ మాత్రం తాను తన ఆస్తిలో కొంత భాగాన్ని ఆమెకు ఇచ్చినట్లుగా స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.