Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బెల్లంకొండ మూవీకి లింకేంటి..?

By:  Tupaki Desk   |   1 April 2021 6:00 PM IST
ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బెల్లంకొండ మూవీకి లింకేంటి..?
X
టాలీవుడ్‌ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు బెల్లంకొండ శ్రీను హిందీ డెబ్యూ మూవీకి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి కామన్ కనెక్షన్ ఏర్పడింది.

దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ సినిమా ఎలక్ట్రానిక్ - థియేట్రికల్ - శాటిలైట్ - డిజిటల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. తాజాగా 'ట్రిపుల్ ఆర్' సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న బాలీవుడ్ సంస్థ `పెన్ ఇండియా లిమిటెడ్` వారు దక్కించుకున్నారు. అంతేకాదు అన్ని భాషల ఎలక్ట్రానిక్ - శాటిలైట్ - డిజిటల్ హక్కులు కూడా పెన్ స్టూడియోస్ వారు తీసుకున్నారు.

బాలీవుడ్‌‌ లో భారీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న 'పెన్ ఇండియా' వారు 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' రైట్స్ రికార్డు స్థాయి ధరకు తీసుకోవడంతో.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ సినిమాకి లింక్ ఏర్పడింది. అంతేకాకుండా తెలుగు 'ఛత్రపతి' సినిమాకి రాజమౌళి అవడం.. రాజమౌళి తండ్రి ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్'తో పాటుగా హిందీ 'ఛత్రపతి' కోసం వర్క్ చేస్తుండటం గమనార్హం.