Begin typing your search above and press return to search.

సినిమా వాళ్ల‌కి కేంద్ర బ‌డ్జెట్ కి లింకేంటీ?

By:  Tupaki Desk   |   2 Feb 2022 11:30 AM GMT
సినిమా వాళ్ల‌కి కేంద్ర బ‌డ్జెట్ కి లింకేంటీ?
X
సినిమా వాళ్ల‌కి కేంద్ర బ‌డ్జెట్ కి లింకేంటీ?..! దీని కారణంగా నిరుత్సాహంలో చాలా మంది హీరోలు, ద‌ర్శ‌కులు..!.. వివ‌రాల్లోకి వెళితే.. తాజాగా కేంద్రం క్రిప్టో క‌రెన్సీ మీద 30 శాతం ఇన్ క‌మ్ టాక్స్ విధించింది, ఇది ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఓ బాంబు పేల్చేసింది, వాస్త‌వానికి సినిమా వాళ్ల డ‌బ్బు చాలా వ‌ర‌కు ఇప్పుడు షేర్లు, క్రిప్టో కెరెన్సీ మీద‌నే ఉంది, ఇబ్బ‌డి ముబ్బ‌డి ఆదాయాన్ని సంపాదించిడానికి చాలా మంది కుర్ర హీరోలు ఈ దారి ఎంచుకుంటున్నారు.

అయితే తాజాగా ప్ర‌వేశ పెట్టిన కేంద్ర బ‌డ్జెట్‌లో ఇప్పుడు క్రిప్టో ద్వారా వ‌చ్చే ఆదాయంలో దాదాపు 30 శాతం టాక్స్ రూపంలో ప్ర‌భుత్వానికి తిరిగిచ్చేయ‌ల‌నే నిబంధ‌న‌ని జోడించారు. ఊహించ‌ని విధంగా కేంద్రం భారీ ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో ప్ర‌స్తుతం చాలా మంది సినిమా వాళ్లు ల‌బోధిబో అంటున్నారు అని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. ఇండ‌స్ట్రీలో ప్ర‌తీ ఏటా కోట్ల బిజినెస్ జ‌రుగుతూ వుంటుంది. దీని వ‌ల్ల కోట్ల డ‌బ్బు చేతులు మారుతున్న విష‌యం తెలిసిందే.

ఇలా చేతులు మారుతున్న డ‌బ్బులో కొంత వ‌ర‌కు బ్లాక్ మ‌నీ.. అంటే ట్యాక్స్ కి సంబంధం లేకుండా లెక్క‌ల్లో రాకుండా చూపిస్తున్న డ‌బ్బు. అయితే ఈ డ‌బ్బుని పారితోషికంగా తీసుకుంటున్న చాలా మంది ద‌ర్శ‌కులు, హీరోలు ఈ క‌రెన్సీని క్రిప్టో క‌రెన్సీగా వాడుతూ షేర్‌లు కొంటున్నారు. దీనికి పెద్ద‌గా ఇన్ క‌మ్ ట్యాక్స్ చూపించ‌డం లేదు.

ఇది గ‌మ‌నించిన కేంద్రం కొత్తగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో క్రిప్టో క‌రెన్సీపై 30 శాతం ట్యాక్స్ ని విధిస్తూ షాకిచ్చింది. దీంతో చాలా వ‌ర‌కు ద‌ర్శ‌కులు, హీరోలు ఏంటీ మా ప‌రిస్థితి అని బోరు మంటున్నారు. మ‌న హీరోలు, ద‌ర్శ‌కుల్లో చాలా మంది ట్యాక్స్ స‌వ్యంగా క‌డుతున్నార‌న్న దాంట్లో ఎలాంటి క్లారిటీ లేదు. చాలా వ‌ర‌కు కోట్ల‌ల్లో డ‌బ్బులు చేతులు మారుతుండ‌టంతో ట్యాక్స్ ఎగ‌వేస్తున్న వారే ఎక్కువ‌. ఇప్ప‌డది కుదిరేలా లేక‌పోవ‌డంతో చాలా మంది త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.