Begin typing your search above and press return to search.

సింగ‌రేణి బొగ్గు గ‌ని కార్మికుడి జీవిత క‌థ‌?

By:  Tupaki Desk   |   31 Jan 2022 12:48 AM GMT
సింగ‌రేణి బొగ్గు గ‌ని కార్మికుడి జీవిత క‌థ‌?
X
నానీ `వీ` లాంటి ప్ర‌యోగం ఫెయిలైనా `శ్యామ్ సింగ‌రాయ్`తో బ్యాక్ టు బ్యాక్ ప్ర‌యోగాల బాట‌ను అనుస‌రించాడు. అయితే ఒక‌ ప్ర‌యోగం ఫెయిలైనా ఆ వెంట‌నే మ‌రో ప్ర‌యోగంతో హిట్టు కొట్టాడు. శ్యామ్ సింగ‌రాయ్ క‌రోనా క్రైసిస్ లోనూ కాసులు కురిపించింది. టికెట్ ధ‌ర స‌మ‌స్య ఉన్నా ఫ‌ర్వాలేద‌నిపించింది. దేవ‌దాసీ వ్య‌వ‌స్థపై ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్ తో నానీ మెప్పించాడు. రాహుల్ సాంకృత్య‌న్ ఈ సినిమాని తెర‌కెక్కించారు.

ప్ర‌స్తుతం నానీ మ‌రో ప్ర‌యోగం చేస్తున్నారు. ద‌స‌రా అనేది టైటిల్. ఇందులో నానీ ర‌గ్గ్ డ్ గా మాసీగా ఉండే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. కోర‌మీసం గుబురు గ‌డ్డం ర‌ఫ్ గా అత‌డి ఫేస్ యాటిట్యూడ్ ప్ర‌తిదీ విభిన్నంగా తీర్చిదిద్దారు. దసరా లో నానీతో పాటు నాయిక‌ కీర్తి కూడా డి గ్లామ్ పాత్రలో కనిపించనున్నారు.

తెలంగాణ గ్రామీణ నేప‌థ్యం ఈ సినిమాకి మ‌రో ప్ర‌ధాన అస్సెట్ కానుంది. ఐదేళ్ల క్రితం నేను లోక‌ల్ అనే సినిమాలో చివరిసారిగా కలిసి కనిపించిన ఈ జంట ద‌స‌రా కోసం ఇంత‌కుముందు వర్క్ షాప్ కి హాజరయ్యారు. లుక్ టెస్ట్ లు పూర్త‌య్యాయి. రిజ‌ల్ట్ చాలా సంతృప్తికరంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ని ప్రారంభించ‌నున్నార‌ని తెలిసింది. త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టే లుక్ ని మార్చుకునే ప‌నిలో నాని- కీర్తి ఉన్నారు.

కీర్తి సురేష్ తన కెరీర్‌లో ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో జీవించింది. న‌టిగా అనేక ఆద‌ర్ బ్యాక్డ్ పాత్రలను పోషించింది. అయితే దసరాలో డీగ్లామ‌ర‌స్ పాత్ర‌ను నైజాం యాస మాట్లాడే అమ్మాయి పాత్ర‌ను పోషించేందుకు ఉవ్విళ్లూరుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం క‌థాంశం పూర్తి ప‌ల్లె నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలిసింది. తెలంగాణలోని సింగరేణిలోని బొగ్గుగని ప్రాంతంలోని ఓ పల్లెటూరి కథ ఇద‌ని ఇందులో నాని బొగ్గు గ‌ని కార్మికుడిగా క‌నిపిస్తార‌ని టాక్ వినిపిస్తోంది.

ఆగస్ట్ లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. కుద‌ర‌ని ప‌క్షంలో 2022 ద‌స‌రా బ‌రిలో విడుద‌ల‌య్యేందుకు ఆస్కారం ఉంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.