Begin typing your search above and press return to search.
పవన్ సినిమాలపై జీహెచ్‌ఎంపీ ఎన్నికల ప్రభావం ఎంత వరకు?
By: Tupaki Desk | 18 Nov 2020 11:30 AM ISTపవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయం మరో వైపు సినిమాలను బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే రాజకీయ పరమైన కార్యక్రమాలు చర్చలు జరుపుతున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 8 నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఇటీవలే వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ సమయంలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావడంతో మళ్లీ పవన్ సినిమాలకు బ్రేక్ తీసుకుంటాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా జనసేన పార్టీ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకుల అభిష్టం మేరకు గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్దం అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఎన్నికల కోసం తక్కువ సమయం ఉన్న కారణంగా పవన్ సుడిగాలి పర్యటనలు చేస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న పవన్ కనీసం మూడు నాలుగు రోజులు అయినా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు షూటింగ్ లో పాల్గొంటూనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పవన్ వెళ్లే అవకాశం ఉంది.
ఈ ఎన్నికల హడావుడి ఎక్కువ రోజులు ఉండదు. డిసెంబర్ మొదటి వారం వరకు ఎన్నికల హడావుడి పూర్తి అవుతుంది. కనుక రెండు వారాల పాటు ఎన్నికల్లో పాల్గొన్నా సినిమాల విషయమై ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఎలాగూ వకీల్ సాబ్ ను జనవరిలో విడుదల చేసే ఆలోచన లేదు. కనుక మెల్లగా అయినా షూటింగ్ చేసేవీలుంది. డిసెంబర్ లో క్రిష్ మూవీకి డేట్లు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అప్పటి వరకు ఎన్నికల హడావుడి పూర్తి అవుతుంది. కనుక పవన్ సినిమాలపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావం పెద్దగా ఉండదు అనిపిస్తుంది.