Begin typing your search above and press return to search.

సినిమాకున్న క్రేజ్ 'హీరోయిన్'కి లేదేంటి..??

By:  Tupaki Desk   |   21 Jun 2021 9:43 AM GMT
సినిమాకున్న క్రేజ్ హీరోయిన్కి లేదేంటి..??
X
సినీ ఇండస్ట్రీలో ఎక్కువశాతం అనుకున్నవి జరగవు అనేది నిజమవుతుంది. అందుకే కొన్నిసార్లు హీరోయిన్స్ విషయంలో సంధిగ్ధం అలాగే ఉంటుంది. ఒక్కోసారి సినిమాలు సూపర్ హిట్ అయితే హీరోయిన్స్ వెలుగులోకి రారు. మరికొన్ని సందర్భాలలో హీరోయిన్స్ క్లిక్ అవుతారు కానీ సినిమాలు ప్లాప్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ కుర్రహీరోయిన్ విషయంలో అనుకున్నవి జరగట్లేదట. పాన్ ఇండియా సినిమాలో నటించినా ఇప్పటివరకు సరైన గుర్తింపు రాలేదని టాక్. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతం కేజీఎఫ్ సినిమా గురించి తెలియనివారు లేరు.

కేజీఎఫ్ అనగానే అందరికి హీరో యష్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు గుర్తొస్తుంటాయి. కానీ అందులో కనిపించిన బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీనిధిశెట్టి మాత్రం సరిగ్గా గుర్తు లేదని అంటున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ అనేది దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలై పాన్ ఇండియా ఫేమ్ అందుకుంది. అలాగే హీరో యష్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు కూడా కేజీఎఫ్ ఫేమ్ తీసుకొచ్చింది. కానీ శ్రీనిధి గురించి అసలు ఊసే లేకుండా పోయింది. కేజీఎఫ్ సినిమాలో హీరో లవర్ క్యారెక్టర్ రీనా పాత్రలో కనిపించిన శ్రీనిధి.. బేసిగ్గా ఇండియన్ మోడల్ అనే సంగతి తెలిసిందే. అయితే సినిమా 200కోట్లకు పైగా వసూల్ చేసింది. కానీ హీరోయిన్ రెమ్యూనరేషన్ మాత్రం పదిహేను లక్షలే అని టాక్. అలాంటి పాన్ ఇండియా సినిమాకు 15లక్షలు రెమ్యూనరేషన్ అంటే సందేహపడుతున్నారు నేటిజన్లు.

అయితే కేజీఎఫ్ సినిమా అంత భారీ హిట్ అయినప్పటికీ శ్రీనిధి విషయంలో అవకాశాలు తేవడంలో పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. మాములుగా సినిమాల్లో హీరోయిన్స్.. అంటే కథలో హీరో తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కానీ శ్రీనిధి విషయంలో ఉల్టా జరిగింది. హీరోయిన్ పొందాల్సిన గుర్తింపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పొందాడు. మాములుగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్.. రాధేశ్యామ్ సినిమాలో పూజాహెగ్డే స్పెషల్ కాబోతున్నారు. మరి కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి మాత్రం సినిమా హిట్ అయినా హైలైట్ కాలేదు. అలాగే కేజీఎఫ్ 2 విషయంలో ఆమె పేరు పెద్దగా వినిపించడం లేదు. అలాగే శ్రీనిధి కేవలం కేజీఎఫ్ కాకుండా కోబ్రా సినిమా ఒకటే చేస్తోంది. మరి ఈ లెక్కన అమ్మడి కెరీర్ కేజీఎఫ్ సీక్వెల్ పైనే బేస్ అయ్యుందని అర్ధం అవుతుంది. చూడాలి మరి ఈసారి కేజీఎఫ్-2తో బిజీ హీరోయిన్ అవుతుందేమో..!