Begin typing your search above and press return to search.

'ఖిలాడి' ముద్దుగుమ్మల పరిస్థితి ఏంటబ్బా?!

By:  Tupaki Desk   |   8 March 2022 11:30 PM GMT
ఖిలాడి ముద్దుగుమ్మల పరిస్థితి ఏంటబ్బా?!
X
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన కథానాయికల పేర్ల జాబితాలో మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి కనిపిస్తారు. ఈ ఇద్దరూ కూడా రవితేజ 'ఖిలాడి' సినిమాలో కలిసి కనువిందు చేశారు. ఎలాంటి మొహమాటానికి పోకుండా అందాల సందడి చేశారు. ఈ సినిమాకి ముందు ఇద్దరూ కూడా చెప్పుకోదగిన సినిమాలేవీ చేయలేదు. మీనాక్షి చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా మాత్రమే చేసింది. ఆ సినిమా ఒకటి ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక డింపుల్ విషయానికి వస్తే 'గద్దలకొండ గణేశ్'లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ మాత్రమే జనాలకి కాస్త గుర్తుంది.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కూడా 'ఖిలాడి' సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. దర్శకుడు రమేశ్ వర్మ ఈ సినిమాలో ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చాడు. రవితేజ వంటి సీనియర్ స్టార్ హీరో సరసన కథానాయికలుగా అవకాశం రావడం సామాన్యమైన విషయమేం కాదు.

అందుకు రవితేజ ఒప్పుకోవడం కూడా పెద్ద విశేషమే. అందువలన కథానాయికలు ఇద్దరూ కూడా అందాలు ఆరబోసే విషయంలో అస్సలు మొహమాటానికి పోలేదు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదన్నట్టుగా డింపుల్ మరీ రెచ్చిపోయింది. తెరమీదనే కాదు .. ప్రమోషన్స్ లో కూడా ఆమె తన దూకుడు చూపించడం విశేషం.

ఏ సినిమాలోనైనా కథ ఉండాలి . జుట్టు ఉంటే ఎన్నిముడులైనా వేయవచ్చును అన్నట్టుగా, కథ అంటూ ఉంటే కథానాయకుడు ఏమైనా చేయగలుగుతాడు. కథ లేకపోతే కథానాయకుడు చేసేది ఏమీ ఉండదు. ఒకవేళ చేయడానికి హీరో ట్రై చేసినా ప్రేక్షకులు పట్టించుకోరు.

అలాగే హీరోయిన్లు ఎంతగా అందాలు ఆరబోసినా కథలేకపోతే ఆ అందాల ఆరబోతకు ప్రయోజనం ఉండదు .. ఆశించిన ప్రయోజనం నెరవేరదు. సినిమా హిట్ అయితేనే హీరోయిన్ల అందానికి రాణింపు వస్తుంది. లేదంటే అనవసరమైన ఆయాసమే మిగులుతుంది.

పాపం 'ఖిలాడి' సినిమా విషయంలో ఇద్దరి కథానాయికల విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది .. అయినా రవితేజ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఈ భామల పరిస్థితి ఏమిటి? అనే ఆలోచన రావడం సహజం. మీనాక్షి చౌదరి చేతిలో 'హిట్ 2' సినిమా మాత్రమే ఉంది. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ జోడీగా ఆమె ఈ సినిమా చేసింది. ఇక డింపుల్ విషయానికి వస్తే శ్రీవాస్ - గోపీచంద్ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తోంది. అంతకుమించి ప్రస్తుతానికైతే వీళ్లు కమిటైన సినిమాలు కనిపించడం లేదు. మరి ఈ సినిమాలైనా వారి కెరియర్ కి హెల్ప్ అవుతాయేమో చూడాలి.